Taraka Ratna Died & Cause of Death News: గత 23 రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్సపొందుతూ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బాధాకరమైన విషయాన్నీ నందమూరి కుటుంబ సభ్యులు ప్రకటించారు.
ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. గత 23 రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్సపొందుతూ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బాధాకరమైన విషయాన్నీ నందమూరి కుటుంబ సభ్యులు ప్రకటించారు. జనవరి 27న నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా హాజరైన తారకరత్న.. గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో.. హుటాహుటిన నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించారు. అప్పటినుండి తారకరత్న క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడని.. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని చెబుతూ వచ్చారు వైద్యులు.
ఇక హాస్పిటల్ లో చేరిన రోజునుండి ఇప్పటిదాకా తారకరత్న ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మెరుగు కనిపించకపోవడంతో.. వైద్యులు కూడా అహర్నిశలు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. తారకరత్న కోసం ఫారెన్ నుండి స్పెషలిస్ట్ లను సైతం పిలిపించారు. విదేశీ వైద్యుల రాకతో నందమూరి ఫ్యాన్స్ లో తారకరత్న ఆరోగ్యం మెరుగుపడే అవకాశము ఉందని ఆశలు మొదలయ్యాయి. కానీ.. వారు వచ్చాక కూడా తారకరత్న కన్ను మూశాడని తెలియడంతో ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్.. తారకరత్న ఇక లేడనే వార్తలను జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే.. 23 రోజులపాటు వైద్యులు అహర్నిశలు శాయశక్తులా ప్రయత్నించి కూడా తారకరత్నని బతికించలేకపోవడానికి కారణం ఏంటని ఆరా తీస్తున్నారు.
ఈ నేపథ్యంలో తారకరత్నను డాక్టర్స్ ఎందుకు బతికించలేకపోయారు? అనే విషయంపై ప్రధానంగా పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 27న యువగళం పాదయాత్రలో తారకరత్న అస్వస్థతకు గురవడంతో పాటు గుండెపోటుకు గురయ్యాడు. అప్పటికప్పుడే ఆ హార్ట్ స్ట్రోక్ ఎఫెక్ట్ బ్రెయిన్ పై ప్రభావం చూపించడంతో.. అప్పటినుండి తారకరత్న బ్రెయిన్ డెడ్ అయిపోయింది. వెంటనే మెరుగైన వైద్యం కోసం.. నందమూరి బాలకృష్ణ, కుటుంబ సభ్యులు బెంగుళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ ముందునుండి ఐసీయూలో వైద్యం అందించినప్పటికీ అవకాశం లేకుండా పోయింది.
తారకరత్నని బతికించడానికి లోకల్ డాక్టర్స్.. విదేశాల నుండి స్పెషలిస్ట్ లను సైతం పిలిపించారు. కానీ.. బ్రెయిన్ నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో.. డాక్టర్స్ మినిమమ్ ప్రయత్నించేందుకు కూడా అవకాశాలు లేకుండా పోయాయని తెలుస్తోంది. ఐసీయూలోనే వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతూ.. తారకరత్న బాడీ కూడా మెడిసిన్స్ కి, వైద్యుల ప్రయత్నాలకు రియాక్ట్ అవ్వకపోవడంతో ఇప్పుడిలా జరిగిపోయింది. తారకరత్న కోసం నందమూరి ఫ్యామిలీ, ఫ్యాన్స్ ఎంతలా ప్రార్థించారో.. పూజలు చేశారో చూస్తూనే ఉన్నాం. ఇన్నిరోజులు హాస్పిటల్ లో ఉండేసరికి.. అందరిలోనూ ఎక్కడో చిన్న ఆశ ఉండేది. కానీ.. వారి ఆశలన్నీ నీరుగారుస్తూ నందమూరి తారకరత్న.. బ్రెయిన్ నుండి, బాడీ నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవడమే కారణంగా.. బతికించుకునే అవకాశం లేకుండా పోయింది. భౌతికంగా దూరమైనా.. తారకరత్న ఎప్పటికీ నందమూరి ఫ్యామిలీ, ఫ్యాన్స్ గుండెల్లో పదిలంగా ఉంటాడు.