‘ఆర్ఆర్ఆర్‘.. దర్శకధీరుడుగా పేరొందిన రాజమౌళి రూపొందించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం. బాహుబలి, బాహుబలి 2 లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో పీరియాడిక్ మల్టీస్టారర్ గా ఆర్ఆర్ఆర్ ని తెరకెక్కించాడు. గతేడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 1200 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఈ సినిమాని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే.. ఆర్ఆర్ఆర్ విడుదలై దాదాపు పది నెలలు దాటినా ఇంకా సినిమా గురించి ఇండస్ట్రీలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అందుకు కారణం వరల్డ్ వైడ్ ఆర్ఆర్ఆర్ ని రాజమౌళి ప్రమోట్ చేయడమే.
అవును.. ఆర్ఆర్ఆర్ సినిమా దర్శకుడిగా రాజమౌళి పేరు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లగా.. ఇండియన్ సినిమా పేరును, ముఖ్యంగా తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ వేదికలపై మార్మోగేలా చేసింది. థియేట్రికల్ గా ఎంత పేరు వచ్చిందో.. ఈ సినిమాకి ఓటిటిలో విడుదలయ్యాక కూడా అంతే పేరొచ్చింది. హాలీవుడ్ ప్రముఖుల నుండి అంతకుమించి ప్రశంసలు దక్కాయి. దీంతో ఆర్ఆర్ఆర్ క్రేజ్ వరల్డ్ వైడ్ విస్తరించింది. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను కైవసం చేసుకున్న ఆర్ఆర్ఆర్.. ఇండియా నుండి అధికారికంగా ఎంట్రీ కాలేకపోయింది. కానీ.. దర్శకుడు రాజమౌళి తన శాయశక్తులా ప్రయత్నిస్తూ ఆర్ఆర్ఆర్ ని ఆస్కార్ లో నిలిపేందుకు పూనుకున్నాడు.
ఇప్పటికే జపాన్, అమెరికా దేశాలలో ఆర్ఆర్ఆర్ గురించి టీమ్ అంతా కలిసి గట్టిగా ప్రమోట్ చేశారు. రీసెంట్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో బెస్ట్ పిక్చర్ గా గెలవలేకపోయినా.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్(నాటు నాటు) కేటగిరీలో ఎంఎం కీరవాణి అవార్డు గెలిచి ఇండియా మొత్తం ఆనందించేలా చేశాడు. అయితే.. ఆర్ఆర్ఆర్ గురించి అటు ఆస్కార్ వైపు, ఇతర ఇంటర్నేషనల్ అవార్డులలో.. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, జీ లాంటి ఓటిటిలలో కూడా భారీగా ప్రమోషన్స్ జరిగాయి. రాజమౌళితో పాటు మిగతా చిత్రబృందమంతా ప్రమోషన్స్ లో కనిపించారు. కానీ.. సినిమాని ప్రొడ్యూస్ చేసిన దానయ్య పేరు, డీవీవీ బ్యానర్ పేరు ఎక్కడా వినిపించకపోవడం.. ఆయన పేరు ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా ఈ విషయంపైనే చర్చలు జరుగుతున్నాయి. కేజీఎఫ్, సలార్, కాంతార లాంటివి టాపిక్ లోకి వస్తే.. హీరోలకంటే ముందు హోంబలే ఫిలిమ్స్, ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ పేర్లు ముందుగా వినిపిస్తాయి. కానీ.. ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే.. ప్రపంచ దేశాలలో ఈ సినిమా పేరు మార్మోగుతున్నా నిర్మాత డీవీవీ దానయ్య పేరు వినిపించడం లేదు. మరి ఎందుకని దానయ్య పేరు ప్రస్తావనలోకి రావట్లేదని అంటే.. కొన్ని కారణాలు ఉన్నాయని కథనాలు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ ని నెట్ ఫ్లిక్స్ తో పాటు వరల్డ్ వైడ్ ప్రమోట్ చేసేందుకు దానయ్య సహకరించలేదని.. దీంతో రాజమౌళినే తన సొంతంగా కోట్లు ఖర్చుపెట్టి ప్రమోట్ చేశాడని టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. మరి ఆర్ఆర్ఆర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ ;లో తెలపండి.
23 years living in US, I’ve never seen anything like #RRR
1st time an Indian production & talent is been recognized globally.Let’s salute @RRRMovie team as the World celebrates INDIA. #RRRforOscars will open millions of doors for Indian artists & talentspic.twitter.com/OkuJwAJU0x— Vikas Khanna (@TheVikasKhanna) January 12, 2023
Best Picture – #RRR
Best Director – #SSRajamouli
Best Cinematography – #KKSenthil
Best Editing – #SreekarPrasad
Best Song – #NaatuNaatu#FingersCrossed #RRRforOscars https://t.co/eRFGtFS3GT— Thyview (@Thyview) January 18, 2023