స్టార్ లేడీ కమెడియన్ కోవై సరళ.. గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. పుట్టి పెరిగింది తమిళనాడులో అయినా తెలుగులో కూడా స్టార్ కమెడియన్ గా ఎదిగింది. ముఖ్యంగా తెలుగు సినిమాలలో కోవై సరళ – బ్రహ్మానందం కాంబినేషన్ పడిందంటే చాలు.. ఆ సినిమాలో కామెడీ సీక్వెన్స్ బ్లాక్ బస్టర్ అవుతుందని అర్థమవుతుంది. కోవై సరళ కామెడీకి, ఆమె టైమింగ్ కి అంత క్రేజ్ ఉంది.
కెరీర్ లో దాదాపు 800లకు పైగా సినిమాలు చేసిన కోవై సరళ.. కొన్నేళ్లుగా సినిమాలు చేయడం తగ్గించింది. అదీగాక 60 ఏళ్ళ వయసు మీదపడేసరికి సినిమాలు తగ్గించిందని సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే.. సరళ స్ట్రయిట్ తెలుగు సినిమా చేసి దాదాపు ఏడేళ్లు అవుతోంది. 2015లో కిక్-2 తర్వాత మళ్లీ తెలుగు సినిమాలు చేయలేదు. అలాగని తెలుగు ప్రోగ్రామ్స్, అవార్డు ఫంక్షన్స్, ఇంటర్వ్యూలలో కూడా కనిపించలేదు.
మరి కోవై సరళ అడపాదడపా తమిళ సినిమాలు చేస్తోంది. కానీ తెలుగులో ఎందుకు సినిమాలు చేయట్లేదని? ఆమెకు సరైన అవకాశాలు రావట్లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు తెలుగులో ఇంత గ్యాప్ వచ్చింది? మళ్లీ తెలుగులో సినిమాలు చేస్తారా? అనే ప్రశ్నలకు తాజాగా స్పందించింది కోవై సరళ. ఆమె మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమాలు తప్పకుండా చేస్తాను. కానీ నాకు నచ్చే పాత్రలు వస్తేనే.. మంచి రోల్ కోసం వెయిటింగ్” అని చెప్పుకొచ్చారు. కోవై సరళకు తెలుగులో వీరాభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. మరి కోవై సరళ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.