Sudigali Sudheer: తెలుగు బుల్లితెరపై క్రేజీ స్టార్‌డమ్‌తో దూసుకుపోతున్నారు సుడిగాలి సుధీర్. నటుడిగా, యాంకర్‌గా, మెజీషియన్‌గా ఇలా బహుముఖ ప్రజ్ఞను కనబరుస్తున్నారు. మ్యాజిక్ ఆర్టిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించి హీరో స్థాయికి ఎదిగారు. బుల్లితెరపై ఎవరికీ లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం షోలు, సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ రోజు సుధీర్ పుట్టిన రోజు. ఆత్మీయులతో పాటు అభిమానులు సైతం ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘‘ వాంటెడ్ పండుగాడ్’’ సినిమా టీం కూడా సుధీర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో విడుదల చేసింది. సినిమాలోని సుధీర్ క్యారెక్టర్‌కు సంబంధించిన వీడియో అది.
ఆ వీడియోలో సుధీర్.. యాంకర్ పిల్లి దీపికతో కలిసి ఉన్న ఓ పాటకు సంబంధించిన షాట్‌తో పాటు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావుతో కలిసి ఉన్న మరో షాట్‌ను షేర్ చేశారు. మొదటి షాట్‌ను బట్టి చూస్తే.. సుడిగాలి సుధీర్, దీపిక ఓ రొమాంటిక్ సాంగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా, సునీల్, అనసూయలు హీరోహీరోయిన్లుగా ‘‘వాంటెడ్ పండుగాడ్’’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు శ్రీధర్ సీపన్న దర్శకత్వం వహిస్తున్నారు. సుడిగాలి సుధీర్, సప్తగిరి, వెన్నెల కిషోర్, సప్తగిరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కే రాఘవేంద్రరావు సమర్పిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Sudheer: రష్మీపై మండిపడుతున్న సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్! ఏమైందంటే?