సాధారణంగా ఏదైనా కొత్త మూవీ రిలీజ్ కావడం లేటు.. ఎలా ఉంది? చూడొచ్చా లేదా అని మాత్రమే ఒకప్పుడు అడిగేవారు. ఇప్పుడు మాత్రం హిట్ ప్లాఫ్ అనే దాన్ని కలెక్షన్స్ బట్టి చూస్తున్నారు. అది సంక్రాంతి, దసరా, దీపావళి అనేది సంబంధం లేదు. సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఓ అన్ని కోట్లా అయితే చూడొచ్చు అని ప్రేక్షకులు ఫిక్స్ అవుతున్నారు. అయితే ఆ కలెక్షన్స్ లో నిజానిజాల మాట ఏంటనేది పక్కనబెడితే.. ఈసారి సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలైంది. గల్లాపెట్టే గలగలలాడింది. మరి కలెక్షన్స్ సంగతేంటో చూద్దామా?
ఇక విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సినిమాలు అదిరిపోయే విజయాల్ని అందుకున్నాయి. అయితే జనవరి 12న వచ్చిన బాలకృష్ణ.. తొలిరోజు రూ. 54 కోట్ల గ్రాస్ సాధించిందని మైత్రీ మూవీ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు నాలుగు రోజులకు కలిపి రూ. 104 కోట్లకు పైన గ్రాస్ వసూళ్లు వచ్చాయని ప్రకటించింది. చిరు సినిమా మాత్రం మూడు రోజుల్లోనే రూ.108 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీన్నిబట్టి చూస్తుంటే చిరునే సంక్రాంతి రేసులో ముందున్నారు. అయితే లాంగ్ రన్ లో ఎవరికి ఎన్ని వందల కోట్లు వస్తాయనేది తెలుస్తుంది. అయితే మూడు రోజుల కలెక్షన్స్ ఏరియావైజ్ ఎవరెవరికి ఎన్ని కోట్లు వచ్చాయనేది ఇప్పుడు చూద్దాం.
ఆంధ్రా-తెలంగాణ మొత్తం వసూళ్లు రూ 48.46 కోట్లు (రూ.80.85 కోట్ల ప్లస్ గ్రాస్) అని తెలుస్తోంది
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ 60.91 కోట్లు (రూ.105 కోట్ల ప్లస్ గ్రాస్) అని సమాచారం వినిపిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ 37.05 కోట్లు (రూ 59.10 కోట్ల గ్రాస్) అని తెలుస్తోంది.
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ రూ 44.50 కోట్లు (రూ 73.90 కోట్ల గ్రాస్) అని సమాచారం. మరి బాలయ్య సినిమా కలెక్షన్స్ పై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.