హిట్, ప్లాప్‌కు సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. యాక్టర్‌గానే కాకుండా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్‌గానూ సత్తా చాటుతున్నాడు. ఇటీవల ‘దాస్ కా ధమ్కీ’ తో హిట్ కొట్టాడు.
హిట్, ప్లాప్‌కు సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. యాక్టర్‌గానే కాకుండా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్‌గానూ సత్తా చాటుతున్నాడు. ఇటీవల ‘దాస్ కా ధమ్కీ’ తో హిట్ కొట్టాడు. ఇక మనోడు కావాలనే కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తాడో లేక అవి ఉన్న చోటికే తను వెళ్తాడో కానీ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో వేలు పెడుతూనే ఉంటాడు. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో చెయ్యాల్సిన సినిమా విషయంలో చెలరేగిన వివాదాన్ని సారీ చెప్పి సద్దుమణిగేలా చేశాడు. రీసెంట్గా విశ్వక్ చేసిన ఓ ట్వీట్ పెద్ద దుమారానికి తెరలేపింది. ఫస్ట్ ఓ స్మైలీ ఎమోజీని షేర్ చేశాడు. అయితే సందర్భం ఏంటనేది చెప్పకుండా కేవలం ఎమోజీ పోస్ట్ చెయ్యడంతో నెటిజన్లకు ఏం జరిగిందనేది అర్థం కాలేదు.
ఆ సందర్భం ఏంటో చెప్తే మేం కూడా నవ్వుతాం కదా అని కామెంట్స్ చేశారు. కాసేపటి తర్వాత.. ‘వద్దు అంటే వద్దు. ఇది మగవాళ్ళకి కూడా వర్తిస్తుంది. కాబట్టి అరవడం మానండి. కాస్త ప్రశాంతంగా ఉండండి. మనమందరం ప్రశాంత వాతావరణంలో ఉన్నాం, దాన్ని అలాగే ఉండనివ్వండి. విశ్రాంతి తీసుకోండి’ అంటూ మరో ట్వీట్ చేశాడు. ఇది చూశాక నెటిజన్లు అయోమాయానికి గురయ్యారు. అసలు అలా ఎందుకు ట్వీట్ చేశాడు?, ఎవరిని ఉద్దేశించి పెట్టాడు? అంటూ అర్థం కాక తలలు పట్టుకున్నారు.
కట్ చేస్తే, విశ్వక్ సేన్.. ‘బేబి’ డైరెక్టర్ సాయి రాజేష్ గురించే ఈ ట్వీట్లు చేశాడని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘మూవీకి నో చెప్పిన హీరో నువ్వేనా? అయినా బేబికి నో చెప్పి మంచి పని చేశావులే, అది నీకు సూట్ కాదు’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ‘బేబి’ మూవీ కథ మొదట ఓ హీరోకి చెప్తే ఒప్పుకొలేదని, సాయి రాజేష్ ఇటీవల చెప్పుకొచ్చాడు. కనీసం కథ కూడా వినకుండానే రిజెక్ట్ చేశాడని, ఆ రాత్రంతా బాధతో తాను సరిగ్గా నిద్ర కూడా పోలేదని అన్నాడు. ఇప్పుడు విశ్వక్ ట్వీట్‌తో సాయి రాజేష్‌ని హర్ట్ చేసిన హీరో విశ్వక్ సేనే అంటూ నెట్టింట చర్చ జరుగుతుంది. ఇదే నిజమైతే విశ్వక్ సేన్ ఒక మంచి హిట్ సినిమా మిస్ చేసుకున్నాడనే చెప్పాలి.
ఇక ‘బేబి’ సినిమా విషయానికి వస్తే రిలీజ్ అయిన అన్ని చోట్లా మంచి టాక్‌తో నడుస్తుంది. యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా చూసిన కొందరు సినీ ప్రముఖులు మూవీ టీంమ్ను అభినందింస్తున్నారు. ఇక తాజాగా అల్లు అర్జున్ సైతం మూవీ చూసి ప్రశంసించించారు. ‘బేబి’ అప్రిషియేషన్ మీట్ నిర్వహించారు బన్నీ. ఇక పోతే విశ్వక్ సేన్ ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశాడో తనకే తెలియాలి అని కొందరు నెటిజన్లు అంటున్నారు.
“No means no” applies to men as well, so let’s keep it cool and refrain from shouting. We’re all about that peaceful vibe here, so let’s just relax. ✌️
— VishwakSen (@VishwakSenActor) July 20, 2023