విశ్వక్ సేన్.. టాలీవుడ్ లో ఒక సెల్ఫ్ మోటివేటెడ్ యంగ్ హీరో. ప్రస్తుతం అశోక వనంలో అర్జున కల్యాణ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ చేసిన కొన్ని పనులు ఇప్పుడు అతని మెడకు చుట్టుకున్నాయి. ఫిలింనగర్ లో చేసిన ఓ ప్రాంక్ వీడియో విశ్వక్ కు కొన్ని చిక్కులు తెచ్చిపెట్టింది. ఆ ప్రాంక్ వీడియోపై ఓ న్యాయవాది హెచ్‌ఆర్సీలో కేసు నమోదు చేయడం. ఓ ప్రముఖ ఛానల్ ఆ ప్రాంక్ వీడియో గురించి చర్చలు పెట్టడం చూశాం. ఆ ఛానల్ కి వెళ్లి యాంకర్ దేవీ నాగవల్లితో విశ్వక్ సేన్ అభ్యంతరకర భాష వాడాడు. ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను అలాంటి భాష వాడటం పట్ల విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పాడు.
ఇదీ చదవండి: విశ్వక్‌సేన్‌కి మద్దతు.. యాంకర్‌ని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!
అసలు విషయం ఏంటంటే.. విశ్వక్ సేన్ చేసిన వీడియోపై నిర్వహిస్తున్న డిబేట్ లో అతడిని పాగల్ సేన్ అని అంటారని యాంకర్ ప్రస్తావించారు. ఆ తర్వాత స్టూడియోకి వెళ్లిన విశ్వక్ ఆ విషయాన్ని తప్పుబట్టాడు. అలా పిలివడం ఏంటని అసహనం వ్యక్తం చేశాడు. విశ్వక్ ను యాంకర్ దేవీ నాగవల్లి గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అంటూ ఫైర్ అయ్యారు. ఆ క్రమంలో విశ్వక్ ఒక అభ్యంతరకర పదాన్ని ఉపయోగించాడు. ఆ విషయమై ఓ ఇంటరాక్షన్ లో ప్రశ్నించగా విశ్వక్ స్పందించాడు. అలా మాట్లాడి ఉండకూడదని అభిప్రాయ పడ్డాడు. అది అనుకోకుండా వచ్చిన పదమే అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.‘దెబ్బ తగిలినప్పుడు ఎలా అయితే అమ్మా అంటామో.. అలా ఆ పదం వచ్చేసింది. అక్కడ F పదం వాడటం పట్ల సారీ చెప్తున్నాను. అది అనుకోకుండా అలా మాట్లాడేశాను. ఆ ఒక్క పదం మినహా అక్కడ నేను ఏదీ తప్పుగా చేసినట్లు నేను భావిచడం లేదు. నేను వచ్చే సినిమాలకు కూడా ప్రమోషన్స్ ఇంతే వైల్డ్ గా చేస్తాను. కాంట్రవర్సీల కోసం నేను ఎప్పుడూ ప్రమోషన్స్ చేయను. ఈ సినిమాకి 8 ఊర్లు, 10 కాలేజీలు తిరిగా, డే అండ్ నైట్ ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఇవన్నీ కలిపితేనే ప్రమోషన్స్ అంటారు. ప్రాంక్ వీడియో చేసి ఆ కాంట్రవర్సీతోనే నా సినిమా కోసం థియేటర్ కు వెళ్తారనే దురాశతో చేయలేదు’ అంటూ విశ్వక్ తెలిపారు. మీడియా తీరుపై ఓపీనియన్ కోరగా.. ‘మీడియా లేకపోతే నేను లేను. ఫలక్‌నామా దాస్ సినిమా అప్పుడు నన్ను ఎంతగా సపోర్ట్ చేశారో నాకు తెలుసు. ఇది ఒక అనుకోని ఘటన అనే చెప్పాలి. ఒక విద్యార్థిని బట్టి తరగతి మొత్తం గురించి మాట్లాడలేం. ఇట్స్ ఏ బ్యాడ్ డే.. ఇంక దీన్ని లాగడం అనవసరం’ అంటూ విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు. విశ్వక్ సేన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.