ఈ మధ్య ఫ*క్ అనే మాట చాలా కామన్ అయిపోయింది. తెలుగులో అంటే బాగోదని ఇంగ్లీష్ లో రెండక్షరాల బూతు మాటని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సినిమాల్లో ఈ బూతు మాటని ఎక్కువగా వాడుతున్నారు. సినిమాల్లో అంటే పాత్రలు, తపేలాలు, గుండుగులు, ఇత్తడి సామాన్లు డిమాండ్ చేశాయి కాబట్టి తప్పలేదు అంటారు. కానీ నిజ జీవితంలో కూడా వాట్ ద ఫ*క్ అని అంటే హౌ? ఆ హౌ? ఈ బూతు మాటని పబ్లిక్ లో కూడా ఇష్టమొచ్చినట్టు వాడేస్తున్నారు. తెలుగులో దాన్ని ట్రాన్స్ లేట్ చేస్తే పెద్ద బూతు మాటది. ఆ విషయం తెలిసినా మాట్లాడేస్తున్నారు. అది ఒక అలవాటుగా మారిపోయింది. హీరోలు, హీరోయిన్లు ఏ ఈవెంట్ కి వచ్చినా, ఫంక్షన్స్ లో అలవాటులో పొరపాటుగా అనేస్తున్నారు.
సె*క్స్, ఫ*క్ వంటి బూతు మాటలని అలవాటులో పొరపాటుగా అనేస్తున్నారు. అలా అనేసి తర్వాత నాలుక కరుచుకుంటున్నారు. తాజాగా హీరో విశ్వక్ సేన్ కూడా బూతు మాట మాట్లాడబోయి నాలుక కరచుకున్నారు. ముఖచిత్రం ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ లో భాగంగా విశ్వక్ సేన్ బూతు మాట మాట్లాడబోయి నాలుక కరచుకున్నారు. తన స్నేహితుడు సందీప్ రాజ్.. ముఖచిత్రం సినిమాలో క్యామియో రోల్ చేయమని అడిగితే.. సినిమా చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటా అని అన్నారు. అలా సినిమా చూసిన తర్వాత రోల్ ఏదైనా గానీ చేసేయాలి అని ఫిక్స్ అయ్యానని, అంతగా తనకు ఆ సినిమా కథ నచ్చిందని విశ్వక్ సేన్ అన్నారు. అయితే ఎంత స్నేహం ఉన్నా కూడా మొహమాటానికి చేసేస్తా అని చెప్పే టైపు కాదని అన్నారు.
సినిమా చూసి ఐ వాంట్ టూ ఫ* అనబోయి.. వెంటనే సరి చేసుకుని.. సినిమా చూసి ఈ సినిమాలో భాగమవ్వాలని సీరియస్ గా తీసుకున్న నిర్ణయం అని విశ్వక్ సేన్ అన్నారు. విశ్వక్ సేన్ ఆ మాట అనబోయారని తెలిసి వెనుక ఉన్న హీరోయిన్లు నవ్వుకున్నారు. అలా విశ్వక్ సేన్ కంట్రోల్ చేసుకున్నారు. ఆ ఒక్క పదం పబ్లిక్ లో మాట్లాడితే తప్పని తెలిసి కూడా కొంతమంది మాట్లాడేస్తున్నారు. కానీ విశ్వక్ సేన్ మాత్రం అది పద్దతి కాదని కంట్రోల్ చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ లాయర్ పాత్రలో నటించారు. క్లైమాక్స్ కి 10, 15 నిమిషాల ముందు తన పాత్ర వస్తుందని అన్నారు. ఈ సినిమాలో క్యామియో రోల్ చేసి 2 రోజులు చాలా ఎగ్జైట్ మెంట్ కి గురయ్యానని విశ్వక్ సేన్ అన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా సమాజం మీద ప్రభావం చూపుతుందని, ఈ సినిమా చూశాక ఖచ్చితంగా నేటి యువతకు బుద్ధి వస్తుందని అన్నారు.