తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు యంగ్ హీరోల హవా కొనసాగుతుంది. ఈ నగరానికి ఏమైంది చిత్రంతో మంచి విజయం అందుకున్న యువ హీరో విశ్వక్ సేన్ తర్వాత స్వియ దర్శకత్వంలో హీరోగా నటించిన ‘ఫలక్‌నుమాదాస్ ’ మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ మద్య అశోకవనంలో అర్జున కల్యాణం మూవీ ప్రమోషన్ సందర్భంగా చేసిన ఫ్రాంక్ వీడియో పలు వివాదాలకు దారి తీసిన విషయం తెలిసిందే. తాజాగా విశ్వక్ సేన్ మరో వివాదంలో ఇరుక్కున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో విశ్వక్ సేన్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల విశ్వక్ సేన్, వెంకటేష్ నటించిన ‘ఓరిదేవుడా’ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం పలు చిత్రాల్లో బిజీగా ఉన్న విశ్వక్ సేన్ తాజాగా మరో వివాదంలో చిక్కకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ఓ మూవీలో నటించబోతున్నట్లు ఇటీవల ఒక అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీలో అర్జున్ కూతురు ఐశ్వర్యా అర్జున్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీకి సంబంధించి పూజా కార్యక్రమం కూడా గ్రాండ్ గా జరిగింది. అంతేకాదు మూవీకి సంబంధించి ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఇలాంటి సమయంలో హీరో విశ్వక్ సేన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
అగ్రిమెంట్ ప్రకారం సరైన కారణాలు చెప్పకుండా సడెన్ గా తప్పుకోవడంపై హీరో, డైరెక్టర్ అర్జున్ సీరియస్ అయినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ వివాదంపై ఫిలిమ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేయడానికి సిద్దమైనట్లు టాక్ వినిపిస్తుంది. సినీ ఇండస్ట్రీలో యాక్షన్ కింగ్ అర్జున్ స్టార్ హీరోగానే కాకుండా తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. గతంలో తెలుగు లో అభిమన్యుడు చిత్రానికి దర్శకత్వం వహించారు. అర్జున్ ప్రాజెక్ట్ నుంచి విశ్వక్ సేను ఎందుకు తప్పుకున్నాడనేదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. మరి ఈ ఇష్యూ ఎంత వరకు వెళ్తుంతో చూడాలి.. కాకపోతే ఈ విషయంపై ఇరువురి హీరోల నుంచి ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు.