తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రామదాస్ పుట్టినరోజు నేడు. ఆయన బర్త్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రామదాస్ పుట్టినరోజు ఇవాళ. ఆయన పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈయన ప్రేమ, భార్గవ, స్వామి ఐపీఎస్ వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఈయన దర్శకుడిగా కూడా పని చేశారు. రాజేంద్రప్రసాద్, రోజా, బ్రహ్మానందం, శివాజీ రాజా, ఎం.ఎస్. నారాయణ తదితరులు నటించిన ‘మీ ఆయన జాగ్రత్త’ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈయన ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరించారు. ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాకి కాకినాడ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. రీసెంట్ జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ లో దిల్ రాజు ప్యానెల్ లో వైస్ ప్రెసిడెంట్ గా ఈయన ఎన్నికయ్యారు. ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ ముందుకొస్తారు. ఇండస్ట్రీలో మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇవాళ ఆయన బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ.. ఆయన మరిన్ని మంచి పనులు చేస్తూ.. ఉన్నత శిఖరాలను అధిగమించాలని కోరుకుందాం.