తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు. తెలుగు ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు, మనోజ్, లక్ష్మి ముగ్గురు కూడా సినిమాలు చేస్తున్నారు. ఫలితంతో సంబంధం లేకుండా సినిమాలు మాత్రం చేస్తూనే ఉన్నారు. కేవలం నటులుగానే కాకుండా నిర్మాతలుగా, దర్శకులుగా తమ సత్తా చాటుతున్నారు. తాజాగా మంచు ఫ్యామిలీ నుంచి కొత్త సింగర్లు బయలుదేరారు. డైనమిక్ స్టార్ విష్ణు మంచు హీరోగా నటిస్తున్న గాలి నాగేశ్వరావు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు అనే మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు విష్ణు. ఈ క్యారెక్టర్ అనౌన్స్ చేసినప్పటి నుంచీ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా ఈ సినిమాలోని ఓ పాటకు కొరియోగ్రఫీ చేస్తుండటం ఈ సినిమాకి మరో హైలైట్. తాజాగా మరో స్పెషల్ అట్రాక్షన్ ఈ సినిమాకి యాడ్ అయ్యింది. మంచు మోహన్ బాబు మనవరాళ్లు, విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా ఈ సినిమా పరిచయం అవుతున్నారు. అయితే వారు నటులుగాకాకుండా సింగర్స్ గా ఈ మూవీ కి పనిచేయబోతున్నారు.
అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమాలోని ఓ పాటను అరియానా, వివియానా పాడటం విశేషం. భాస్కరభట్ల ఈ పాటకు సాహిత్యం అందించారు. సినిమాకి కీలకంగా నిలిచే ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈషాన్ దర్శకత్వంలో మంచు విష్ణు నటిస్తున్న ఈ మూవీ కథ, స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.