స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప”.తో ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంతో గ్రాండ్ గా పాన్ ఇండియన్ ఎంట్రీ ఇవ్వడమే కాదు.., స్టైలిష్ స్టార్ ఈ మూవీ నుంచి ఐకాన్ స్టార్ ట్యాగ్‌తో ముందుకు రాబోతున్నాడు. పేరు మార్చుకోవడమే కాదు.. ఈ మూవీ తర్వాత ఫేట్ కూడా మార్చుకోవాలని గట్టిగా అనుకుంటున్నాడు. అందుకే మంచి సబ్జెక్ట్స్ డీల్ చేసే ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్ విక్రమ్ కె.కుమార్ తో ఓ మూవీకి కమిట్ అయ్యాడు. అయితే ఆ సినిమా స్టార్ట్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు అనుమానంగా మారింది. ప్రజెంట్ అల్లు అర్జున్ చుట్టూ చాలామంది దర్శకులు తిరుగుతున్నారు. కానీ.., బన్నీనే నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నాడు.
ఇప్పటికే ఖరారైపోయిన సినిమాల్ని సైతం అల్లు హీరో ఆలస్యం చేస్తున్నాడు. ఇక బన్నీ – విక్రమ్ కాంబో నుంచి సినిమా వస్తుందని అధికారిక ప్రకటన కూడా వచ్చి, రెండేళ్లయ్యింది. అయితే ఇప్పటి వరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇంకా చెప్పాలంటే బన్నీ – విక్రమ్ ల సినిమా ఉంటుందన్న విషయాన్ని సైతం జనాలు మర్చిపోయారు. దీంతో మూవీ పట్టాలెక్కుతుందా లేదా అన్న సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.
మరోవైపు విక్రమ్ మాత్రం ఈ ప్రాజెక్టుపై ఆశలు వదల్లేదని తెలుస్తోంది. `బన్నీతో సినిమా ఉంటుందని.. అది తన కలల ప్రాజెక్టు అని చెప్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్టు సిద్ధం చేస్తున్నా అంటున్నాడు విక్రమ్. విక్రమ్ కె.కుమార్ లాస్ట్ మూవీ `గ్యాంగ్ లీడర్`. దానికి ముందు చేసిన మూవీ హలో. ఈ రెండు సరిగ్గా ఆడకపోవడంతో అటు బన్నీ, ఇటు విక్రమ్ ఇంకొంచెం టైమ్ తీసుకోవాలని అనుకున్నారట. విక్రమ్ ప్రస్తుతం నాగ చైతన్యతో `థ్యాంక్యూ`ని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమాతో విక్రమ్ తన మార్క్ చూపించగలిగితే, బన్నీ నుంచి క్లియరెన్స్ వస్తుందని చెప్పుకుంటున్నారు. సో… విక్రమ్ కె.కుమార్ కి ఇంకా అవకాశమైతే మూసుకొనిపోలేదు అనమాట. మరి.., అల్లు అర్జున్ మనం డైరెక్టర్ తో మూవీ చేయాలని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.