టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల జోరు కొనసాగుతోంది. హీరోలంతా పాన్ ఇండియా సినిమాలపైనే ఫోకస్ పెడుతున్నారు. విజయేంద్ర ప్రసాద్ పాన్ ఇండియా సినిమా కథలకు కేరాఫ్ అడ్రస్ అనడంలో అతిశయోక్తి లేదు. బాహుబలి, RRR వంటి సెన్సేషనల్ స్టోరీలు అందించిన ఆయన కలం నుంచి మరెన్నో పాన్ ఇండియా సినిమాలు రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. వాటన్నింటిలో ముఖ్యంగా ట్రిపులార్ సినిమాకి సీక్వెల్ రావాలని ఎదురుచూస్తున్నారు. అదే విషయంపై స్వయంగా విజయేంద్ర ప్రసాద్ స్పందించారు.
ఇదీ చదవండి: గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న ప్రముఖ నిర్మాత!
ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయనను హోస్ట్ ఇదే ప్రశ్న అడిగారు.. RRRకి సీక్వెల్ ఉండబోతోందా అని. ఆ ప్రశ్నకు విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘ఓ రోజు తారక్ మా ఇంటికి వచ్చాడు. అతను కూడా ట్రిపులార్ సినిమా సీక్వెల్ గురించి అడిగాడు. కొన్ని లైన్లు చెప్పాను. రాజమౌళి, తారక్ కు బాగా నచ్చాయి. దేవుడి అనుగ్రహం ఉంటే ట్రిపులార్ సినిమా కొనసాగింపు చిత్రం వస్తుంది’ అంటూ విజయేంద్ర ప్రసాద్ సమాధానం ఇచ్చారు. RRR సీక్వెల్ కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.