Vijayendra Prasad : ఇండియా లెవెల్‌లో పేరున్న రచయితల్లో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ది ఓ ప్రత్యేక స్థానం. రాజమౌళి ప్రతీ సినిమాకు విజయేంద్ర ప్రసాదే కథ అందిస్తు ఉంటారు. మొన్న వచ్చిన బహుబలి, బాహుబలి 2లతో పాటు ఈ రోజు విడుదలైన ‘ ఆర్‌ఆర్‌ఆర్’కు కూడా కథ అందించింది ఆయనే. అయితే, తండ్రి రాసిన ఓ సినిమా కథ విషయంలో రాజమౌళి చాలా హర్ట్ అయ్యాడని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘ భజరంగీ భాయ్ జాన్ కథ సల్మాన్‌కు చెప్పాననగానే రాజమౌళి కళ్లలో నీళ్లు తిరిగాయి. కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అది చూసి నేను ‘‘కథ ఉంచేయనా?’’ అని అడిగాను. కానీ, అతను ‘‘ లేదు. కథ వారికే ఇచ్చేయండి’’ అని చెప్పాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఓ రోజు నా దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే ‘‘ బాహుబలి పార్ట్ 1.. రెండు వేల మంది ఆర్టిస్టులతో ఫైట్ సీన్ జరుగుతోంది. అది కాక రోహిణి కార్తె, ఎండలు మండిపోతున్నాయి. మంచి కాక మీద ఉన్నపుడు అడిగారు.. 15 రోజులు ముందో, 15రోజులు తర్వాతో అడిగుంటో కథ నేనే తీసేవాడిని’’ అన్నాడు’’ అంటూ తనకు, రాజమౌళికి మధ్య జరిగిన సంభాషణను చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : RRR మూవీ బెనిఫిట్ షోలో విషాదం.. గుండెపోటుతో వ్యక్తి మృతి
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.