ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లకు, డైరెక్టర్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంటుంది. తమ అభిమాన హీరోల కోసం ఏం చేయడానికైనా సిద్దంగా ఉంటారు ఫ్యాన్స్. తాము ఎంతగానో ఆరాధించే హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే.. పెద్ద పెద్ద కటౌట్స్, పాలాభిషేకాలులతో థియేటర్ల వద్ద నానా హంగామా చేస్తుంటారు. తమ అభిమాన హీరో ప్రత్యక్షంగా కనిపిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. ఈ మూవీ ప్రమోషన్ బిజీలో ఉన్నారు లైగర్ టీమ్. ఈ క్రమంలోనే ఓ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ, అనన్య ఫ్యాన్స్ అత్యుత్సాహంతో మద్యలోనే వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే..
తెలుగు ఇండస్ట్రీలో ‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత యూత్ లో గొప్ప ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. తనదైన స్టైల్, మ్యానరిజంతో యువతను బాగా ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు ఈ రౌడీ హీరోకి అమ్మయిల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విజయ్ అక్కడ సైతం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విజయ్ లైగర్ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు.
ముంబైలోని ఓ మాల్‌లో ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ కి బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేతో కలిసి విజయ్ దేవరకొండ కూడా వెళ్లాడు. విజయ్, అనన్యలను చూసిన ఫ్యాన్స్ వేదిక వద్దకు గుంపులుగా దూసుకువచ్చారు. అక్కడకు భారీగా ఫ్యాన్స్ చేరుకొని పెద్ద ఎత్తున హంగామా చశారు. లైగర్.. విజయ్.. అంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హంగామా చేశారు. దయచేసి మీరంత తొక్కిసలాట లేకుండా కామ్ అవ్వాలని ఫ్యాన్స్‌ని కోరాడు. సిబ్బంది సైతం వారిని అదుపు చేయలేకపోయింది.
ఇక ఫ్యాన్స్ ఎవరిమాట వినే పరిస్థితిలో లేరని విజయ్ దేవరకొండకు అర్థం అయ్యింది. అక్కడ పరిస్థితి చేయి దాటిపోయేలా కనిపించడంతో విజయ్, అనన్యలు ఈవెంట్ మధ్యలోనే వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత విజయ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘ఇంత గొప్ప ప్రేమ నేను ఎప్పుడూ చూడలేదు.. మీ ప్రేమ నా హృదయాన్ని గెల్చుకుంది. మీ అందరి గురించే ఆలోచిస్తూ బెడ్ మీదకు వెళుతున్నాను. గుడ్ నైట్ ముంబై, లైగర్’ అంటూ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ మూవీ ఆగస్టు 25న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Your love has touched me ❤️
Hope you all are safe and back home. Wish I could have been there with you all so much longer.Thinking about you all as I go to bed.
Goodnight Mumbai 🤗❤️#Liger— Vijay Deverakonda (@TheDeverakonda) July 31, 2022
Team #Liger is overwhelmed with all the love that you showered on us today at our mall visit in Mumbai.
We would like to thank everybody who came to support us. Unfortunately, we had to leave midway for the safety of everyone! #WaatLagaDenge#LigerManiaBegins
(1/2) pic.twitter.com/8jJzip4GLQ
— Charmme Kaur (@Charmmeofficial) July 31, 2022
ఇది చదవండి: బాలీవుడ్‌పై సౌత్ డామినేషన్ ఉంది.. మాకూ టైమొస్తది.. కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు!