విజయ్ దేవరకొండ సినిమాలంటే కనీసం హీరోయిన్ తో లిప్ లాక్ అయినా ఉండాల్సిందే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మరి సమంతతో కలిసి నటించిన ఖుషి సినిమాలో అలాంటి సన్నివేశాలు ఉన్నాయా? సెన్సార్ టాక్ ఏంటి?
విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ఖుషి. హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ బ్యానర్ పై విభిన్న ప్రేమ కథా చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ ఖుషి మూవీ విడుదలకి ముస్తాబయింది. ఈ మూవీ తాజాగా సెన్సార్ ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ మూవీకి సెన్సార్ ఇచ్చిన రిపోర్ట్ సంచలనం సృష్టిస్తుంది. సెప్టెంబర్1న విడుదల అవుతున్న ఖుషి మూవీ కి సంబంధించిన ప్రమోషన్స్ జోరందుకున్నాయి. చిత్ర బృందం ప్రస్తుతం ఆ పనిలోనే ఫుల్ బిజీ గా ఉంది. తాజాగా ఖుషి సినిమాలోని సాంగ్స్ కి సంబంధించి మ్యూజిక్ కన్సర్ట్ ని నిర్వహించారు. అందులో సమంత, విజయ్ దేవరకొండ ఫుల్ కెమిస్ట్రీ తో డాన్స్ చేసి సినిమా మీద అమాంతం అంచనాలు పెరిగేలా చేసారు.
అలాగే సమంత పర్సనల్ గురించి విజయ్ ,విజయ్ పర్సనల్ గురించి సమంత చెప్పేసరికి సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సూపర్ గా కుదిరింది కాబట్టి ఇంక ఈ మూవీ లో విజయ్ బ్రాండ్ మార్క్ అయిన లిప్ లాక్ లో సమంత వీర లెవల్లో చేసుంటుందని ఎప్పడెప్పుడు సినిమా చూద్దామనే ఆతృతతో సినీ అభిమానులు ఉన్నారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ హీరోగా చేసిన అన్ని సినిమాల్లోను దాదాపుగా హీరోయిన్ తో లిప్ లాక్ సీన్స్ ఉంటాయి. అన్ని తెలుగు సినిమాల్లో కథ ఎటు తిరిగి ఎటు వచ్చినా హీరో చివరికి విలన్ మీద గెలిచినట్లు విజయ్ అన్ని సినిమాల్లో కథ ఎటు తిరిగి ఎటు వచ్చినా హీరో, హీరోయిన్ కి లిప్ లాక్ ఉండాల్సిందే.
ఈ విషయం పూర్తిగా తెలిసిన విజయ్ అభిమానులు సమంత, విజయ్ ల లిప్ లాక్ సీన్ స్క్రీన్ మీద ఒక రేంజ్ లో ఉండబోతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ఖుషి మూవీలో ఎలాంటి ముద్దు సీన్లు లేవని సెన్సార్ రిపోర్ట్ ని బట్టి తెలుస్తుంది.ఎందుకంటే ఎలాంటి ముద్దు సీన్లు ఉన్న సెన్సార్ యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తుంది.కానీ సెన్సార్ ఖుషి మూవీకి క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది. ఖుషి మూవీ ఎలాంటి అసభ్యకర సన్నివేశాలకి చోటు లేని ప్యూర్ ప్రేమ కథ అని తెలుస్తుంది.వరుస పరాజయాలతో ఉన్న సమంత,విజయ్ దేవరకొండ కి ఖుషి ప్రేమకథ ఎంతవరకు సక్సెస్ ని ఇస్తుందో సెప్టెంబర్ 1 న తెలిసిపోతుంది.