Naga Chaitanya: సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయిన హీరో హీరోయిన్లకు అప్పుడప్పుడు క్రేజీ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఎందుకు విడిపోయారనే విషయం పదేపదే ప్రస్తావిస్తే ఎవరికైనా విసుగు రావచ్చు. కానీ.. ఆ విసుగులోనే అంతకుమించిన ఆసక్తికరమైన సందేహాలు బయటికి వస్తుంటాయి. మరి విడిపోయిన హీరో హీరోయిన్లు మరోసారి కలిసి నటించాల్సి వస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందనే ప్రశ్న.. సదరు హీరోనే అడిగితే ఎంత క్రేజీగా ఉంటుందో కదా.. ఇటీవల అక్కినేని నాగచైతన్య విషయంలో అదే జరిగింది. నాగచైతన్య ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతోనే చైతన్య బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు. ఆగష్టు 11న ఈ సినిమా అన్ని భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంగ్లీష్ ఛానల్ తో ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతన్య.. లాల్ సింగ్ చడ్డా మూవీ గురించి చాలా విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇక ఎప్పటిలాగే విడాకులపై ప్రశ్న కూడా ఎదురైంది. కానీ.. దానికి చైతూ స్పందించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ‘నా పర్సనల్ లైఫ్ గురించి అందరూ మాట్లాడుకోవడం బాలేదు. ప్రతి ఒక్కరికీ పర్సనల్ లైఫ్ ఉంటుంది. సమంతతో విడాకులపై ఇప్పటికే ప్రకటించాం. అయితే.. విడాకులకు కారణమేంటో ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్రస్తుతం ఎవరి పర్సనల్ లైఫ్ వారు లీడ్ చేస్తున్నాం. ఆమె దారి ఆమెదే.. నా దారి నాదే. ఇంతకంటే ఇంకా చెప్పాల్సిందేమి లేదుని చెప్పిన చైతూ.. తనపై రూమర్స్ గురించి ఆలోచించడం, పట్టించుకోవడం మానేశానని చెప్పేశాడు. ఇక చైతూకి బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సమంతోనే కుదరిందని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఆ విషయంపై కూడా ఓ ఆసక్తికర ప్రశ్న ఎదరురైంది. ఫ్యూచర్ లో సమంతతో కలిసి నటించే అవకాశం ఉందా? అని అడిగిన ప్రశ్నకు చైతూ గట్టిగా నవ్వేశాడు. ‘ఒకవేళ అలా జరిగితే చాలా క్రేజీగా ఉంటుందేమో.. కానీ జరుగుతుందో లేదో నాకు తెలియదు. ఈ ప్రపంచానికే తెలియాలి’ అంటూ జవాబిచ్చాడు. ప్రస్తుతం చైతూ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి చైతూ - సామ్ ఫ్యూచర్ లో కలిసి నటిస్తారా లేదా మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.