సినీ పరిశ్రమంలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.
ఈ మద్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. గల నెలలో ప్రముఖ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. బాలీవుడ్ లో వరుసగా బుల్లితెర, వెండితెర నటులు కన్నుమూయడంతో అభిమానులు విషాదంలో మునిగిపోయారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణం తీవ్ర దుఖాఃన్ని మిగిల్చింది. మాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు పూజపుర రవి కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
సినీ పరిశ్రమంలో వరుస విషాదలో చోటు చేసుకోవడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు. మలయాళ సినీ పరిశ్రమలోని సీనియర్ నటులలో ఒకరైన పూజపుర రవి(83) ఆదివారం ఆయన కుమార్తె ఇంట్లో తుదిశ్వాస విడిచారు. కళానిలయం నాటక బృందం ద్వారా రంగస్థల నటుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. దాదాపు 800 కి పైగా సినిమాల్లో నటించారు. పాన్ ఇండియా నటుడు, టోవినో థామస్ హీరోగా నటించిన ‘గప్పీ’ మూవీ ఆయన చివరి చిత్రం. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరయూర్ లోని తన కుమార్తెతో ఉంటున్నట్లు తెలుస్తుంది. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.
పూజపుర రవి నటించిన ‘కల్లన్ కప్పలిల్ తన్నె’, ‘రౌడీ రాము’, ‘ఓర్మాకల్ మరిక్కుమో’, ‘అమ్మిని మమ్మవన్’, ‘ముత్తారంకున్ను పి ఓ’, ‘మజా పెయ్యున్ను మద్దాలం కొట్టున్ను’ వంటి ఇతర చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించారు. పుజపుర రవి ఎక్కువగా హాస్యపాత్రల్లో నటించేవారు. రంగ స్థలంపై దాదాపు 4000 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఇతర మంత్రులు పూజపుర రవి మృతి పట్ల సంతాపం తెలిపారు. రంగస్థలం ద్వారా పూజపుర రవి ప్రజల మనసులను గెలుచుకున్నారని సీఎం అన్నారు. ఎక్కువగా హాస్య పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారని.. ఆయన మృతి రాష్ట్ర కళ, సాంస్కృతిక రంగానికి తీరని లోటు అని విజయన్ ఒక ప్రకటనలో తెలిపారు.