ఇటీవల పలు సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు, బలవన్మరణం ఇలా ఇండస్ట్రీకి చెందిన వారు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లోనే కాదు.. అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు.
ఈ మద్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సినీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ ఇలా ఇండస్ట్రీకి చెందిన వారు పలు కారణాల వల్ల కన్నుమూస్తున్న విషయం తెలిసిందే. దీంతో వారి కుటుంబాల్లోనే కాకుండా అభిమానులు సైతం తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. హర్యానా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది.. ప్రఖ్యాత హర్యాన్వీ గాయకుడు రాజు పంజాబీ కన్నుమూశారు.
ప్రముఖ హర్యాన్వీ గాయకుడు రాజు పంజాబీ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయస్సు 40 సంవత్సరాలు. రాజు పంజాబీ హర్యానాలోని హిసార్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కొంతకాలంగా జాండీస్‌తో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని డిశ్చార్ అయ్యారు. కానీ అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ కన్నుమూశారు. రాజు పంజాబీ మరణానికి 10 రోజుల ముందు ‘ఆప్సే మిల్కే యారా హమ్కో అచ్చా లగా థా’ సాంగ్ విడుదల చేశారు. ఈ పాట బాగా పాపులర్ అయ్యింది.
రాజు పంజాబీ కెరీర్ లో దేశీ దేశీ, ఆచా లగే సే, తు చీజ్ లజవాబ్, భాంగ్ మేరే యారా నే, లాస్ట్ పెగ్ మంచి పేరు తీసుకు వచ్చాయి. రాజు పంజాబీ మరణవార్త తెలిసిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘ప్రముఖ హర్యాన్వీ గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ రాజు పంజాబీ జీ మరణించారనే విషాద వార్త తెలిసింది. ఆయన మరణం హర్యానా సంగీత పరిశ్రమకు తీరని లోటు. ఈ తీరని దుఃఖాన్ని భరించే శక్తిని ఆయన కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. ఓం శాంతి!’ అంటూ ట్విట్ చేశారు. రాజు పంజాబీ మరణవార్త ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. పలువురు అభిమానులు సోషల్ మీడియాలో నివాళులర్పించి తమ సంతాపాన్ని తెలియజేశారు.
प्रसिद्ध हरियाणवी गायक एवं संगीत निर्माता राजू पंजाबी जी के निधन का दुखद समाचार प्राप्त हुआ। उनका जाना हरियाणा म्यूजिक इंडस्ट्री के लिए अपूरणीय क्षति है।
ईश्वर दिवंगत आत्मा को अपने श्री चरणों में स्थान दें तथा उनके परिजनों को यह अथाह दुःख सहन करने की शक्ति प्रदान करें।
ॐ शांति!
— Manohar Lal (@mlkhattar) August 22, 2023