ఈ మద్య కాలంలో పలు సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు నెలకొంటున్నారు. పలు కారణాల వల్ల సినీ ప్రముఖులు చనిపోవడంతో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు.
సినీ ఇండస్ట్రీలో ఈ మద్య వరుస విషాదాలు చోటు చేసుకోవడం అభిమానులను తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. ప్రముక నటీనటులు, దర్శక, నిర్మాతలు పలు కారణాల వల్ల కన్నుమూస్తున్నారు. ప్రముఖుల కన్నుమూతతో వారి కుటుంబాల్లోనే కాదు అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు. ఈ మద్య ప్రముఖ హాలీవుడ్ నటుడు స్టార్ కమెడియన్ పాల్ రెబెన్స్ మున్ను మూసిన విషయం తెలిసిందే.. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే హాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు డారెన్ కెంట్ కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
అమెరికన్ స్టార్ కమెడియన్ పాల్ రెబన్స్ ఈ మద్య అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు డారెన్ కెంట్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆగస్టు 11, శుక్రవారం కన్నుమూశారు. ఈ విషాద వార్తను మంగళవారం హాలీవుడ్ ట్యాలెంట్ ఏజెన్సీ ట్విట్టర్ వేధికగా అధికారికంగా వెల్లడించింది. డారెన్ కెంట్ ఇంగ్లాండ్ లోని ఎస్సెక్స్ లో జన్మించారు. 2007 లో ఇటాలియా కాంటిలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని 2008 లో మిర్రర్స్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ద లిటిల్ స్ట్రేంజర్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డారెన్. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించిన డారెన్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
ఇక గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీరిస్ తో ప్రపంచ వ్యాప్తంగా డారెన్ కి విశేషమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. తర్వాత హెచ్ బి ఓ డ్రామా సిరీస్‌లలోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సన్నీబాయ్ మూవీలో అతని నటనకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. డారెన్ కెరీర్ లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు. నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆయన ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. డారెన్ కెంట్ కురుచగా ఉండేవాడు.. ఆయనకు స్కీన్ కి సంబంధించిన అరుదైన వ్యాధి ఉండేది. అతనిపై సూర్య కిరణాలు పడకూడదు.. ఒకవేళ పడితే శరీరంలో చాలా మార్పులు వచ్చి ఇబ్బంది పడేవాడు. అయినప్పటికీ తన నటనతో ప్రేక్షకులను మెప్పించేవాడు. కెంట్ మరణంతో హాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు కెంట్ కి నివాళులు అర్పిస్తూ సంతాపం తెలియచేస్తున్నారు.
What a privilege it was to be your friend and to work together on so many projects over the years. Life won’t be the same without you 💔I will miss you so much. RIP darling Darren Kent xxxx pic.twitter.com/Fz81LszZkF
— Jane Gull (@GullJane) August 14, 2023