టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ చాలా రోజుల తర్వాత మళ్లీ తెరమీదకు వచ్చారు. ఆయన హీరోగా ఫర్నాజ్ శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ఇందువదన. ఎమ్‌ఎస్‌ఆర్ దర్శకత్వంలో శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై నైనిష్య & సాత్విక్ సమర్పణలో మాధవి ఆదుర్తి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి శివ కాకాని సంగీతం అందిస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఇందువదన టీజర్‌ను విడుదల చేశారు. రోమాంటిక్, సస్సెన్స్, థ్రిల్లర్ అంశాలతో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ టీజర్‌లో వరుణ్ సందేశ్ అడవిలో ఉండే పల్లెటూరి లుక్‌లో దర్శనమిస్తున్నాడు. మీసం మెలేసి అచ్చం పల్లె సీమలో ఉన్న కుర్రాడిలా ఉన్నాడు. రోమాన్స్, సస్పెన్స్‌తో దర్శకుడు ఈ సినిమాను కొంచెం ఆసక్తిగా తెరకెక్కించినట్లు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది.
ఇక చాలా రోజుల తర్వాత ఓ సినిమా చేస్తున్నాడు హీరో వరుణ్ సందేశ్. గతంలో అనేక సినిమాలో నటించిన వరుణ్ మంచి నటుడిగా గుర్తింపు పొందారు. అయితే ఆయన చాలా రోజుల తర్వాత ఇందువదన సినిమా చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది.
https://www.youtube.com/watch?v=N1shZL6VnPI&t=57s