నటసింహం నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’గా అదరగొడుతున్నారు. మాస్ మసాలా ఎలిమెంట్స్ తో తీసిన ఈ సినిమాకు సూపర్ ఆరంభం దక్కింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ ఏకంగా రూ.54 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. స్పెషల్ గా పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. కానీ రెండో రోజు వచ్చేసరికి అంటే జనవరి 13న చిరు ‘వాల్తేరు వీరయ్య’ రిలీజైంది. దీంతో కలెక్షన్స్ లో చాలా డ్రాప్ కనిపించింది. తొలిరోజుతో పోలిస్తే రెండు రోజు చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి.
ఇక విషయానికొస్తే.. బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సినిమా తొలి రోజు అద్భుతం చేసినప్పటికీ రెండో రోజు మాత్రం చాలా డ్రాప్ అయిపోయింది. ఓవరాల్ గా చూసుకుంటే రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ 61.15 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. బాలయ్య కెరీర్ లో ఇదే అత్యధికం. లాంగ్ రన్ లో చిరు సినిమాతో పోటీపడి బాలయ్య ఎంతవరకు నిలబడతాడు అనేది తెలియాల్సి ఉంది. అలానే బాలయ్య మూడు రోజుల వసూళ్లు లిస్టు కూడా వచ్చేసింది. మరి బాలయ్య ఏయే ఏరియాల్లో 3 రోజులకు కలిపి ఎన్నెన్ని కోట్లు సాధించాడు అనేది తెలియాలంటే కింద లిస్టు చూసేయండి.
తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ 37.05 కోట్లు (రూ 59.10 కోట్ల గ్రాస్) అని తెలుస్తోంది.
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ రూ 44.50 కోట్లు (రూ 73.90 కోట్ల గ్రాస్) అని సమాచారం. మరి బాలయ్య సినిమా కలెక్షన్స్ పై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.