‘సానియా మీర్జా..‘ ఇటీవల వార్తల్లో ఎక్కువుగా వినిపించిన పేరిది. షోయబ్ మాలిక్ కు.. సానియాకు చెడిందని, విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. దాన్ని నిజం చేసేలా.. షోయబ్ పాకిస్తాన్ మోడల్ అయేషా ఉమర్ తో దిగిన బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఆ తరువాత ఇవన్నీ రూమర్స్ అని తేలిపోయాయి. ఇది పక్కన పెడితే.. తాజాగా, ఓ బాలీవుడ్ హీరో సానియా అంటే పిచ్చి ఇష్టమని.. తన మీద క్రష్ ఉండేదని వెల్లడించాడు.
ఎవరకి క్రష్ ఉండదు చెప్పండి. హీరోయిన్లను మించిన అందం సానియా మీర్జాది. అంతకుమించి ఒక అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి. అందరిలానే బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ఆమెపై మనసు పారేసుకున్నాడు. ఈ విషయాన్ని ‘తోడేలు’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొచ్చాడు. వరుణ్ ధావన్, కృతి హీరో హీరోయిన్లుగా నటించిన ‘తోడేలు’ సినిమా నవంబర్ 26న పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. ఈ సినిమాను తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న అతడు.. తనకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అంటే పిచ్చి అని చెప్పుకొచ్చాడు. “సానియాపై నాకు బాగా క్రష్ ఉండేదని.. ఆమె అందం, చందం చూసి ఆమె అంటే చాలా ఇష్టం కలిగిందని.. ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకునేవాడినని..” వరుణ్ ధావన్ వెల్లడించాడు.
“నేను సినిమాల్లోకి రాకముందు ఒక ప్రొడక్షన్ కంపెనీలో మామూలు ఉద్యోగిగా పనిచేసేవాడిని. ఆ సమయంలో సానియా యాడ్ చేసేందుకు అక్కడికి వచ్చారు. ఆమె తనకు ఆపిల్ కావాలని అడిగితే వెళ్లి తెచ్చిచ్చాను. అది చూసి సానియా తల్లి నన్ను ఎందుకు తెచ్చావ్ అంటూ గద్దించింది. దీంతో సానియా తానే తెమ్మన్నానని చెప్పడంతో ఆరోజు బతికిపోయా..” అని వరుణ్ ధావన్ తన తొలి ప్రేమను బయటపెట్టాడు. అప్పటి నుంచే తనకు సానియా అంటే క్రష్ ఏర్పడిందని చెప్పుకొచ్చాడు.
In a recent interview to CurlyTailsME, the Bollywood actor revealed that he had a crush on the tennis star and once had the opportunity to work with her because of the production company he worked at. #VarunDhawan #SaniaMirza pic.twitter.com/WyABTlXqo1
— Images (@dawn_images) November 24, 2022