సంక్రాంతి వస్తుందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో సందడి గట్టిగానే ఉంటుంది. అందుకు తగ్గట్లే స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలోకి వస్తుంటాయి. ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంటాయి. అయితే ఈసారి స్టార్ హీరోలు చిరు, బాలయ్య.. తమ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. అయితే వీటితోపాటే విజయ్ ‘వారసుడు’ కూడా తెలుగులో విడుదల కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో మొన్న మొన్నటి వరకు కాన్ఫిడెంట్ గా ఉన్న నిర్మాత దిల్ రాజు.. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ఇదేనని ప్రకటించారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న స్ట్రెయిట్ తెలుగు సినిమాలు. వీటితో పాటే విజయ్ ‘వారసుడు’, అజిత్ ‘తెగింపు’ ఉన్నాయి. అయితే ‘వారసుడు’కి దిల్ రాజు నిర్మాత కావడంతో ఫస్ట్ నుంచి ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతూనే ఉంది. అయితే రీసెంట్ గా ‘వారసుడు’ తెలుగు రిలీజ్ వాయిదా పడిందని ప్రకటించారు. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ని దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు.
ఇక విజయ్ ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’) సినిమాను తమిళనాడులో 11వ తేదీనే రిలీజ్ చేస్తున్నారు. అదే రోజు అక్కడ అజిత్ ‘తునివు’ (తెలుగులో ‘తెగింపు’) సేమ్ డేట్ న రిలీజ్ చేస్తున్నారు. అయితే ‘వారసుడు’ వాయిదా గురించి చెప్పిన దిల్ రాజు.. ‘తెలుగు ప్రేక్షకులు ఫస్ట్ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలను ఫస్ట్ థియేటర్లలో చూడాలని అందుకే ‘వారసుడు’ తెలుగు వెర్షన్ ని వాయిదా వేశాం’ అని క్లారిటీ ఇచ్చారు. దీంతో చిరు, బాలయ్య సినిమాలకు థియేటర్ల విషయంలో లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తుంది. సరే ఇదంతా పక్కనబెడితే విజయ్ ‘వారసుడు’ ట్రైలర్ చూడగానే మీకు ఏమనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
#Vaarasudu will arrive in theaters on January14th
Celebrate Sankranthi in theaters with your family#Thalapathy @actorvijay sir @directorvamshi @MusicThaman @karthikpalanidp @Cinemainmygenes @ramjowrites @rgvhari @ahishor @scolourpencils @vaishnavi141081 @Yugandhart_ @PVPCinema pic.twitter.com/wIfOQ6tOLe
— Sri Venkateswara Creations (@SVC_official) January 9, 2023