శరత్ కుమార్ బిడ్డగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. అయితే ఎంట్రీ వరకే తండ్రి పేరు వాడుకుంది. తర్వాత తన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. సాధారణంగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన వారు ఎవరు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్.. మరీ ముఖ్యంగా విలన్ పాత్రలో కనిపించే సాహసం చేయరు. కానీ వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రం.. బౌండరీలను చెరపేసి.. నటనకు ప్రాధాన్యమున్న పాత్ర లభిస్తే చాలు విజృంభించిపోతున్నారు. మరీ ముఖ్యంగా విలన్ పాత్రలో.. స్టార్ హీరోలను ఢీకొట్టే పవర్ ఫుల్ ప్రతినాయకిగా తెర మీద విజృంభిస్తోంది శరత్ కుమార్. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్‌లతో.. కెరీర్‌లో దూసుకుపోతుంది వరలక్ష్మి శరత్ కుమార్. ఇక తాజాగా ఆమె నటసింహం బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించారు. బాలయ్యను ఢీకొట్టే ప్రతినాయకి పాత్రలో.. నటసింహంతో పోటీ పడి మరి.. నటించారు. సినిమాలో ఆమె పాత్రపై ప్రశంసులు కురిపిస్తున్నారు.
తాజాగా వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలయ్యతో ఓ సీన్ చేసేటప్పుడు.. ఆయన అభిమానులు గుర్తుకు వచ్చి చాలా భయపడ్డాను అన్నారు. ఎందుకు అంటే.. ‘‘సినిమాలో బాలయ్యను పొడిచి చంపే సీన్ చేస్తున్నప్పుడు చాలా భయపడిపోయాను. ఆ సీన్ చూశాక.. బాలయ్య అభిమానులు నాపై పగ పెంచుకుని.. వచ్చి నన్ను చంపుతారేమో అని ఆందోళనకి గురయ్యాను. నేను ఇలా ఇబ్బంది పడుతుంటే బాలయ్య అది గమనించి.. నాలో ధైర్యం నింపారు. అభిమానులు ఆ సన్నివేశాన్ని నెగెటివ్‌గా తీసుకోరని.. తన ఫ్యాన్స్ బాగానే రిసీవ్ చేసుకుంటారని ధైర్యం చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే మీరందరూ ఆ సీన్‌ని రిసీవ్ చేసుకున్నందకు ధన్యవాదాలు’ అని తెలిపింది.
ఈ సినిమా తర్వాత తాను బాలయ్యకు పెద్ద అభిమానిని అయ్యానని చెప్పుకొచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. భానుమతి పాత్ర తనకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది అని తెలిపారు. ఇక బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ‘వీర సింహా రెడ్డి’. సంక్రాంతి సందర్బంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం రూ.140 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ వీర సింహా రెడ్డి సినిమాను నిర్మించారు. సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో.. చిత్రబృందం.. ఆదివారం ‘వీరమాస్ బ్లాక్ బస్టర్’అని విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. మరి వరలక్ష్మి శరత్ కుమార్ నటన మీకు ఎలా అనిపించింది.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.