చిత్ర పరిశ్రమలో కొందరు అందంతో పాపులర్ అవుతారు.. మరికొందరు నటనతో పాపులర్ అవుతారు.. కానీ ఈమె మాత్రం తన పెళ్లిళ్లతో పాపులర్ అయ్యింది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఈ నటి తాజాగా నాలుగో పెళ్లి చేసుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నట్లు సమాచారం. ఈ పాటికికే మీకు అర్ధం అయ్యింది అనుకుంటా ఆ నటి ఎవరో! ఆ నటి మరెవరో కాదు కోలీవుడ్ మ్యారేజ్ క్వీన్ వనిత విజయ్ కుమార్. నటిగా కంటే తన పర్సనల్ విషయాలతోనే వనిత వార్తల్లో హల్ చల్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ అమ్మడు తాజాగా “దేవుడ్ అన్నీ చూస్తున్నాడు.. కాలమే అన్నింటికి సమాధానం చెప్తుంది” అంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
వనిత విజయ్ కుమార్.. వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ.. విడాకులు తీసుకుంటూ.. వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక గతంలో బిగ్ బాస్ షో పై మండిపడ్డ వనిత ప్రస్తుతం ఆ షో మీదే వీడియోలు చేసుకుంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉండే వనిత.. తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ ట్వీట్ లో ఆమె ఈ విధంగా రాసుకొచ్చింది.”మనం మన పక్కనున్న వారిని మోసం చేయవచ్చు. వాళ్ల డబ్బును కూడా దొంగిలించవచ్చు. కానీ డబ్బుకోసం మీరు దొంగతనం మాత్రం చేయకండి. మీకు తెలియని విషయం ఏంటంటే? మనందరిపై ఓ శక్తి పనిచేస్తుంటుంది. ఆ శక్తి మనల్ని ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. ఇక నీ శత్రువులను క్షమించే గుణం నీ దగ్గర ఉంటే.. ఆ దేవుడు నిన్ను కాపాడతాడు” అంటూ వేదాంతం వల్లించింది.
అదీ కాక మనుషులు తప్పులు చేసుకుంటూ వచ్చి.. చివరికి నాకే ఇలా ఎందుకు జరుగుతోంది? అని అనుకుంటారు. ఆ తప్పులు అన్నీ చేసి.. చివరికి ఎవరిని నిందిస్తారు?. సమస్యల పరిష్కారానికి దేవుడు మీకు సపోర్ట్ ఇవ్వలేదంటే.. మీరు పాపాలు చేసినట్టు లెక్కే అంటూ.. తేల్చి చెప్పింది. వీటన్నింటికి కాలమే సమాధానం చెబుతుందని, ఈ విషయాలన్నీ నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడటం లేదు పైగా ఎవరినీ.. బాధపెట్టాలని చెప్పడం లేదు. మీరు తప్పు చేసినప్పుడు దాన్ని అంగీకరించండి. మారడానికి, మారేందుకు అవకాశం ఉన్నప్పుడు మాత్రం మీరు వెనకడుగు వేయకండి అంటూ.. సలహాలు కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ కావడంతో.. వనిత పై నెటిజన్స్.. ఇన్ని రోజుల తర్వాత మీకు తెలిసి వచ్చిందా? అందుకే ఈ వేదాంతం వల్లిస్తున్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
But a realistic sharing for people who wonder … its never too late to change .. god is watching
— Vanitha Vijaykumar (@vanithavijayku1) October 12, 2022