ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సీనీ ప్రముఖులు చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు మాత్రమే కాదు.. ఎంతగానో అభిమానించే అభిమానులు సైతం కన్నీరు పెట్టుకుంటున్నారు.
ఇటీవల పలు సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు వివిధ కారణాలతో కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా మాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత పికెఆర్ పిళ్లై మంగళవారం త్రిసూర్‌లో కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. 1980-90లలో మాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించిన పికెఆర్ పిళ్లై(90) మంగళవారం త్రిసూర్‌లో కన్నుమూశారు. షిర్డిసాయి క్రియేషన్స్ బ్యానర్‌పై ‘చిత్రం’, ‘వందనం’, ‘కిజక్కునరుమ్ పక్షి’ , ‘అమృతం గమ్య’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు పికెఆర్ పిళ్లై. ఒకప్పుడు పిళ్లై కుటుంబ సభ్యులు దేశ వ్యాప్తంగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారు. పన్నెండు సంవత్సరాల క్రితం ముంబైలోని తన వ్యాపారాన్ని వదిలేసి కేరళాకు వచ్చారు పిళ్లై. మొదట ఎర్నాకులం లో ఉన్నప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు త్రిస్సూర్ లో స్థిరపడ్డారు. ఆయనకు భార్య రమ్య, పిల్లలు రాజేష్, ప్రీతి, సోను ఉన్నారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
గతంలో పికెఆర్ పిళ్లై పలు వ్యాపారాలు చేసేవారని.. కొంతమంది స్నేహితులు ఆయను మోసం చేసి వ్యాపారాన్ని స్వాధీనం చేసుకున్నారుని అతని భార్య రమ్య ఆరోపించింది. ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్, రంజిని, నేడుముడి వేణు, పూర్ణం విశ్వనాథన్ నటించి ‘చిత్రం’ మూవీ కేరళలో 300 రోజులకు పైగా నడిచి బ్లాక్ బస్టర్ విజయం అందుకొని అత్యధిక వసూళ్లు చేసింది. ఈ మూవీ నాలుగు భాషల్లో రిమేక్ చేశారు.. తెలుగులో అల్లుడుగారు మూవీతో సైతం మంచి హిట్ అందుకుంది. పికెఆర్ పిళ్లై మృతిపై సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.