ప్రముఖ బాలీవుడ్ టీవీ నటి వైశాలి టక్కర్ మూడు నెలల క్రితం తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈమె యే రిష్తా క్యా కెహ్లతా హై.. ససురాల్ సిమర్ కా సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న వైశాలి టక్కర్.. అక్టోబర్ 16, 2022న.. తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె డెడ్ బాడీ దగ్గర 12 పేజీల సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యం అయ్యింది. ఈ లేఖలో తన పక్కింట్లో ఉండే రాహుల్ అనే వ్యాపారవేత్త, అతడి భార్య తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని.. అందుకే తాను చనిపోతున్నాని పేర్కొంది వైశాలి. పోలీసులు రాహుల్‌ని అరెస్ట్ చేశారు. ఇక కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
వైశాలి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం.. ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ రాహుల్ నవ్లాని, అతడి భార్య దిశా నవ్లాని. వీరిద్దరూ వైశాలి ప్రైవేట్ వీడియోలతో ఆమెను బెదిరించేవారు. అప్పటికే దిశాతో వివాహం అయిన రాహుల్‌కి.. వైశాలితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. రాహుల్‌కి వివాహం అయ్యిందని తెలిసి కూడా వైశాలి.. అతడిని ప్రేమించింది. ఈ క్రమంలో వారు 2021 ఆగస్టులో గోవా ట్రిప్ వెళ్లారు. రాహుల్ తనను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేయడంతో.. వైశాలి అతడికి దగ్గరయ్యింది. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో రాహుల్.. వైశాలికి తెలియకుండా వీడియోలు తీశాడు.
ట్రిప్ ముగించుకుని వచ్చాక.. రాహుల్ మాట మార్చాడు. వైశాలి పెళ్లి ప్రస్తావన తెస్తే.. ఆమె ప్రైవేట్ వీడియోలు చూపించి.. బ్లాక్ మెయిల్ చేయసాగాడు. రాహుల్ భార్య దిశ కూడా అతడికి మద్దతిచ్చేది. మోసపోయానని గ్రహించిన వైశాలి.. రాహుల్‌కి దూరం అయ్యింది. ఈ క్రమంలో 2022లో అమెరికాలో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మితేష్ గౌర్‌తో వైశాలికి వివాహం నిశ్చయం అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న రాహుల్.. మితేష్ ఇన్‌స్టాగ్రాం ఐడీకి వైశాలి ప్రైవేట్ వీడియోలను పంపించాడు. దాంతో మితేష్ వివాహం రద్దు చేసుకున్నాడు.
ఈ సంఘటనతో వైశాలి డిప్రెషన్‌లోకి వెళ్లింది. తాను ఎంత దూరం వెళ్లినా సరే.. రాహుల్ తన జీవితాన్ని నాశానం చేస్తాడని భావించింది వైశాలి. దాంతో ఇండోర్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. రాహుల్, అతడి భార్య.. వీడియోలతో తనను ఎలా బ్లాక్‌మెయిల్ చేశారో వివరిస్తూ.. 12 పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్ రాసింది. పోలీసులు రాహుల్, అతడి భార్య దిశాను అరెస్ట్ చేశారు. త్వరలోనే వారిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. పెళ్లైన వాడిని నమ్మి.. తన జీవితాన్ని నాశనం చేసుకుంది వైశాలి అంటున్నారు ఆమె అభిమానులు. మరి వైశాలి టక్కర్ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.