మెగా కోడలు.. ఉపాసన గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మెట్టినిల్లు, పుట్టింటి నుంచి వచ్చిన గుర్తింపు కాకుండా.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. హెల్త్, సామాజిక సేవ ఇలా విభిన్నమైన అంశాల గురించి పోస్ట్ చేస్తూంటారు. ఇక సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. ఈ క్రమంలో తాజాగా ఉపాసన.. సడెన్‌గా అడవిలో సందడి చేశారు. చెంచుగూడెంలో కుటుంబంతో కలిసి పర్యటించారు ఉపాసన. ప్రస్తుతం ఇందుకు సంబంధిచిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాఇయ. ఆ వివరాలు..
ఉపాసన తండ్రి అనిల్ పుట్టిన రోజు సందర్భంగా.. ఆదివారం నల్లమల అటవీ ప్రాంతంలో కుటుంబంతో కలిసి పర్యటించారు ఉపాసన. తండ్రి బర్త్‌డే వేడుకలు అక్కడే నిర్వహించి.. కాసేపు చెంచుగూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె చెంచులతో కలిసి ఫొటోలు దిగారు. మన్నూనూరు చెక్‌పోస్ట్ ఆవరణలోని పర్యాటక వనమాలిక ఆవరణలో తండ్రి బర్త్ డే వేడుకలు నిర్వహించారు ఉపాసన. అనంతరం.. అపోలో హెల్త్ ఫౌండేషన్ ద్వారా చెక్‌పోస్ట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆస్పత్రిని సందర్శించారు.
అలానే అటవీశాఖలో పనిచేసే ప్రొటక్షన్ వాచర్లకు బూట్లు పంపిణీ చేశారు ఉపాసన. అనంతరం మల్లాపూర్ పెంటకు వెళ్లి అక్కడి చెంచులతో మాట్లాడారు. చెంచు విద్యార్థులు చదువుకోవడానికి ఏర్పాటు చేసుకున్న పూరిగుడిసెకు పైకప్పు వేసుకునేందుకు టార్ఫాలిన్ కవర్లను అందించారు. అలానే విద్యార్థులకు స్వీట్లు అందజేసి.. వారితో కాసేపు ముచ్చటించారు. అనంతరం పుట్టినరోజు సందర్భంగా తండ్రి అనిల్, తల్లి శోభనతో కలిసి శ్రీశైలం వెళ్లి మల్లికార్జున స్వామిని ఆమె దర్శించుకున్నారు ఉపాసన. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.