తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా స్టార్ కుటుంబానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్వయం కృషితో టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా ఎదిగారు చిరంజీవి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా మెగాస్టార్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్నిఅభిమానుల్లో సంపాదించుకున్నాడు. అలాగే మెగా కుటుంబం నుంచి చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ క్రమంలో ప్రస్తుతం మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ ఫొటోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్, ఉపాసన అందరు కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోని మెగాస్టార్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. '' మా ఇంటి కొడలు పిల్ల ఉపాసనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు'' అని ఆయన రాసుకొచ్చారు. అటు రామ్ చరణ్ కూడా సోషల్ మీడియాలో ఈ పిక్ ను పంచుకుంటూ.. 'నా ప్రియమైన ఉపాసన..హ్యపీ బర్త్ డే ' అంటూ విషెస్ చెప్పారు. దీంతో పలువురు నెటిజన్స్, మెగా అభిమానులు ఉపాసనకు కామెట్ల రూపంలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఉపాసన అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ ద్వారా మరో మంచి కార్యక్రమానికి చేయూతనందిస్తున్నట్టు ఆమె ఇటీవలే ప్రకటించారు. అదీ కాక దేశవ్యాప్తంగా 150 వృద్దాశ్రమాలకు తన వంతు సాయం చేస్తానన్నారు. మా ఇంటి కోడలు పిల్ల @upasanakonidela కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. pic.twitter.com/Wh7ApkxRYy — Chiranjeevi Konidela (@KChiruTweets) July 20, 2022 ప్రస్తుతం చిరంజీవి వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, అలాగే బాబీ డైరెక్షన్ లో వాల్తేర్ వీరయ్యగా,ఇవే కాక భోళా శంకర్ అనే మరో మూవీలో మెగా స్టార్ నటిస్తున్నారు. రామ్ చరణ్ శంకర్ దర్శకత్వం RC15 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి నెట్టింట్లో వైరల్ గా మారిన మెగా ఫ్యామిలీ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. To my Dearest @upasanakonidela Happiest Birthday ❤️ pic.twitter.com/IV58uWQqwF — Ram Charan (@AlwaysRamCharan) July 20, 2022 ఇదీ చదవండి: Dhee Show: ఢీ షోలో షాకింగ్ సీన్.. ప్రదీప్, హైపర్ ఆదిలకు వార్నింగ్! సెన్స్ లేదా అంటూ! ఇదీ చదవండి: Brain Aneurysms: స్టార్ హీరోయిన్‌కి అరుదైన వ్యాధి.. ‘2 సార్లు చావు అంచుల వరకు వెళ్లి వచ్చాను’!