మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ‘చిరుత’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా హీరో రేంజ్ కి ఎదిగాడు. పదేళ్ళ క్రితం ఉపాసనను పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. పదేళ్ల తర్వాత రామ్ చరణ్ - ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారు.
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్-ఉపాసన పది సంవత్సరాల క్రితం ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. పెళ్లైన పదేళ్ల తర్వాత వీరు తల్లిదండ్రులు కాబోతున్నారు. దీంతో అటు మెగా అభిమానులు ఇటు మెగా ఫ్యాన్స్ తెగ సంతోషంలో మునిగిపోయారు. ఉపాసన ప్రస్తుతం నిండు గర్భిణి.. ఆమె డెలివరీ కోసం జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. డాక్టర్లు ఉపాసనకు రేపు డెలివరీ టైమ్ ఇచ్చారు. ఉపాసనను స్వయంగా రామ్ చరణ్ వెంట తీసుకొని ఆస్పత్రికి వచ్చారు. చిరంజీవి కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఉపాసనతో పాటు రామ్ చరణ్ ఆస్పత్రిలో ఉన్నారు. ఇక మెగా ఫ్యామిలీలో ఎవరు వారసులుగా వస్తారని ఉత్కంఠ కొనసాగుతుంది.
ఉపాసనకు డెలివరీ సమయం దగ్గరపడటంతో రామ్ చరణ్ షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే జూన్ 20 న ఉపాసన డెలీవరీ టైమ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఉపాసన సైతం తన ఇన్ స్టాలో త్వరలో గుడ్ న్యూస్ వింటారు అంటూ హింట్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉపాసన జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ కి వెళ్లింది. డాక్టర్లు ఆమెకు రేపటి వరకు డెలివరీ టైమ్ ఇచ్చారు. దీంతో బేబీ కోసం ఎగ్జైటెడ్ గా ఉన్నారు మెగా ఫ్యామిలీ. ఇక చరణ్ అయితే తన బిడ్డ కోసం వెయ్యి కళ్లతో ఎదరు చూస్తున్నారని సన్నిహితులు అంటున్నారు.
ఉపాసన డెలివరీ అయిన తర్వాత కొంతకాలం పాటు రామ్ చరణ్ తన ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కారణంతోనే షూటింగ్ టెన్షన్స్ లేకుండా ఆగస్ట్ చివరి వారం వరకూ షూటింగ్స్ కి గ్యాప్ ఇవ్వాలని టీమ్ కు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీ నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో గేమ్ చేంజర్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మెగా ఫ్యామిలీకి వారసుడు రాక ముందే ఉపాసనకు సన్నిహితులు, సెలబ్రెటీలు బహుమతులు పంపుతూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజ్వల ఫౌండేషన్ తరుపు నుంచి ఓ ఉయ్యాల బహుమతిగా వచ్చిందని ఉపాసన తన ఇన్ స్గ్రాలో పోస్ట్ చేసింది. తాజాగా ఉపాసన అపోలో ఆస్పత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.