తెలుగు OTT ‘ఆహా‘లో సూపర్ సక్సెస్ అందుకున్న సెలబ్రిటీ టాక్ షో ఏదైనా ఉందంటే.. ‘అన్ స్టాపబుల్‘ అనే చెప్పాలి. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన ఈ టాక్ షో.. దేశంలోనే ది బెస్ట్ టీఆర్పీ రేటింగ్ తో పాటు ది బెస్ట్ టాక్ షోలలో ఒకటిగా నిలిచింది. ఈ షో ద్వారా బాలకృష్ణ హోస్టింగ్ ఇంపాక్ట్ ఏ లెవెల్ లో ఉంటుందో ఓటిటి ప్రేక్షకులంతా చూశారు.
హోస్టింగ్ మొదటిసారి అయినప్పటికీ బాలయ్యకి తిరుగులేదని నిరూపించాడు. అయితే.. ఇటీవలే ‘అన్ స్టాపబుల్’ మొదటి సీజన్ ముగిసింది. తెలుగు స్టార్ సెలబ్రిటీలంతా పాల్గొనడంతో సీజన్ 2 ఎప్పుడు మొదలవుతుంది? అనే ప్రశ్న ఫ్యాన్స్ మైండ్ లో మెదులుతోంది. అందువల్లే ఎప్పుడెప్పుడు సీజన్ 2 అప్ డేట్ గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.తాజాగా ఆహా.. ‘నెవర్ హావ్ ఐ ఎవర్’ అంటూ బాలయ్యతో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో బాలయ్య కొన్ని ప్రశ్నలకు క్రేజీ సమాధానాలు చెప్పాడు. కాలేజీ ఎప్పుడైనా బంక్ కొట్టారా? అంటే నెవర్ అని, మీ డైలాగ్ మీమ్స్ చూశారా? అంటే ‘ఐ హావ్’ అని.. కో-స్టార్స్ కి ఎప్పుడైనా డాన్స్ లో టిప్స్ ఇచ్చారా? అంటే అవును అని.. ఇక మీ మనవడు/మనవరాలు మిమ్మల్ని తాత అంటే ఒప్పుకుంటారా? అంటే.. ‘నెవర్.. వాళ్ళు నన్ను బాలా అనే పిలవాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ వీడియో ఆహా రిలీజ్ చేసిందో లేదో.. వెంటనే అన్ స్టాపబుల్ ఫ్యాన్స్ అంతా సీజన్ 2 అప్ డేట్ కోసం పోటీపడి మరీ చూశారు. చివరిగా బాలయ్య.. ‘మాటల్లో ఫిల్టర్ ఉండదు. సరదాలో స్టాప్ ఉండదు..’ అనే డైలాగ్ చెప్పేసరికి సీజన్ 2 పై హింట్ ఇచ్చేశారని, త్వరలోనే సీజన్ 2 పై క్లారిటీ రానుందని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక సీజన్ 2 పై ఆహా బృందం ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి. మరి ‘అన్ స్టాపబుల్’ షో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.