డార్లింగ్ ప్రభాస్ పేరు చెప్పగానే ఆరడగుల కటౌట్ ఎలా గుర్తొస్తుందో.. పెళ్లెప్పుడు చేసుకుంటాడు అనే డౌట్ కూడా ప్రతి ఒక్క అభిమానికి రైజ్ అవుతుంది. ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్.. వరసగా ఒకటి తర్వాత ఒకటి సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడే తప్ప పెళ్లెప్పుడు అనేది మాత్రం చెప్పడం లేదు. అసలు మ్యారేజ్ గురించి ఆలోచన ఉందా లేదా అనేది కూడా బయటపెట్టడం లేదు. తాజాగా ‘అన్ స్టాపబుల్ 2’లో ప్రభాస్ గెస్ట్ గా వచ్చాడు. హోస్ట్ బాలయ్య… ఎపిసోడ్ ని కూడా పెళ్లి టాపిక్ తోనే స్టార్ట్ చేశారు. దీనికి ప్రభాస్ ఆన్సర్ ఇచ్చినట్లే ఇచ్చి అందరినీ కన్ఫ్యూజ్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘అన్ స్టాపబుల్ 2’ తాజా ఎపిసోడ్ కోసం ప్రభాస్ గెస్ట్ గా వచ్చాడు. గురువారం రాత్రి 9 గంటలకు ఎపిసోడ్ ని స్ట్రీమింగ్ చేశారు. కొన్ని గంటలపాటు ఆహా సర్వర్లు క్రాష్ అయ్యాయి. ఆ తర్వాత ఎప్పుడో అర్థరాత్రికి నార్మల్ అయిపోయాయి. ఇక పూర్తి ఎపిసోడ్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఎందుకంటే ప్రభాస్ సినిమాలు, వాటి ఈవెంట్స్ తప్పితే పెద్దగా బయట కనపడడు. అలాంటిది షోలో బాలయ్యతో మాటామంతీ అంటే మాములుగా ఉండదు. అందుకు తగ్గట్లే తొలి పార్ట్ మొత్తం సాగింది. ఇక ఎపిసోడ్ మొదలుపెట్టడమే పెళ్లెప్పుడు అనే క్వశ్చన్ తో మొదలుపెట్టారు. దీనికి ప్రభాస్ చాలా డిఫరెంట్ గా ఆన్సర్ ఇచ్చాడు. ‘ఏంటి పెళ్లి ఉందా? లేదా?’ అని బాలయ్య డైరెక్ట్ గా అడిగేశారు. ‘ఏమో సార్ ఇంకా తెలియదు’ అని ప్రభాస్ చెప్పాడు. కానీ అక్కడితో బాలయ్య ఆగలేదు. ‘ఒంటరిగా ఫిక్సయ్యావా?’ అని అడిగారు. ‘లేదు సార్ పెళ్లి చేసుకుంటాను సార్. ఇంకా రాసిపెట్టలేదేమో!?’ అని చాకచక్యంగా ఆన్సర్ ఇచ్చాడు.
వెంటనే కౌంటర్ వేసిన బాలయ్.. ‘మీ అమ్మకు చెప్పిన కబుర్లు నాకు చెప్పకు’ అని ప్రభాస్ నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మెల్లమెల్లగా ప్రభాస్ ఓపెన్ అయ్యాడు. ‘మన చేతుల్లో ఏముంటుంది రాసిపెట్టుండాలి. మీకు తెలుసు కదా!’ అని పెళ్లి జరగకపోవడానికి తాను కారణం కాదన్నట్లు చెప్పుకొచ్చాడు. కానీ బాలయ్య మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ‘మన చేతుల్లోనే ఉందయ్యా బాబు, తాళి కట్టేది మనమే. మూడు ముళ్లు చేతులతోనే వేయాలి’ అని బాలయ్య అన్నాడు. ‘ఏ ధైర్యంతో ఒంటరిగా మిగిలిపోవాలని ఫిక్స్ అయ్యావ్’ అని బాలయ్య అడగ్గా.. ‘నేను ఫిక్స్ అవ్వలేదు సార్’ అని ప్రభాస్ చెప్పాడు. ‘మరి అందరికీ చేసుకుంటా చేసుకుంటానని చెబుతున్నావ్ క్లారిటీ ఇవ్వడం లేదు’ అని బాలయ్య రెట్టించి అడిగితే.. ‘అవుద్ది సార్ నాకు క్లారిటీ లేదు సార్’ అని అందరినీ ఫ్రభాస్ కన్ఫ్యూజ్ చేసి పడేశాడు. మరి ఇదంతా చూసిన మీకు.. ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడనిపిస్తుందా? లేదా ఇంకా వెయిటింగ్ తప్పదంటారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.