తెలుగు ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నారు. ఇటీవల అఖండ సినిమాతో థియేటర్లలో రికార్డ్స్ సృష్టించిన బాలయ్య.. ఇటు ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షో ద్వారా సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తున్నారు బాలకృష్ణ. ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ చిట్‌ఛాట్ షో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.
ఇప్పటికే ఈ షోలో మెహన్ బాబు, నాని, బోయపాటి శ్రీను, బ్రహ్మానందం, ఎంఎం కీరవాణి, రాజమౌళి, అనిల్ రావిపూడి సందడి చేసిన సంగతి తెలిసిందే. బాలయ్య షోలో మాస్ మహారాజ రవితేజ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని సందడి చేశాడు. ‘బొంగరంలా తిరుగుతున్న స్కార్పియో బంపర్ మీద కాలు పెట్టి ఆపినప్పుడు విజిల్స్ పడితే.. వాడే మాస్ మహారాజా రవితేజ’ అంటూ బాలయ్య ఇంట్రడ్యూస్ అదిరిపోయింది. ఈ సందర్భంగా బాలయ్య నాకు ఒక క్లారిటీ కావాలి.. నీకూ నాకూ గొడవ జరిగిందంట కదా అన్న ప్రశ్నకు.. పనీ పాటా లేని డాష్ గాళ్లు అనే మాటలు అంటూ సమాధానం ఇచ్చాడు.
ఈ సందర్భంగా రవితేజను బాలయ్య సూటిగా ఓ ప్రశ్న అడిగారు.. ఇండస్ట్రీలో ఇంత వ్యాల్యూ ఇచ్చే మీ మీద డ్రగ్స్ కేసు పెట్టారు అన్న ప్రశ్నకు రవితేజ ఒకింత ఆవేదన పడ్డారు. ఈ విషయం నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది.. మరీ బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవడం నాకు చాలా కష్టం అనిపించిందని సమాధానం చెప్పారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రొమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.