అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటేనే అన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్. ఇప్పటి వరకూ బాలయ్య తీసుకొచ్చిన సెలబ్రిటీలను చూశాము, ఆ సెలబ్రిటీలతో బాలయ్య చేసిన రచ్చ కూడా చూసాం. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అలానే మ్యాచో స్టార్ గోపీచంద్.. ఈ ఇద్దరినీ బాలయ్య తన షోకి తీసుకొచ్చారు. బాహుబలి విత్ బాలయ్య అని ఒక ప్రోమో విడుదల చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు గోపీచంద్ కి సంబంధించిన గ్లింప్స్ ప్రోమో ఒకటి విడుదల చేశారు. ఆ ప్రోమోలో బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ ముగ్గురూ కలిసి రచ్చ రచ్చ చేశారు. ప్రభాస్ గురించి బాలకృష్ణ ఏవో సీక్రెట్ లు లాగే ప్రయత్నం చేసినట్లు ప్రోమోలో కనిపిస్తుంది.
అప్పుడు గోపీచంద్.. ‘2008 కాదు సార్ అది’ అని ఇంకా ఏదో చెప్పబోతుంటే.. ప్రభాస్ డార్లింగ్.. చెప్పకురా అనే ఎక్స్ ప్రెషన్ పెట్టి.. ఒ..రేయ్ అని అంటారు. ఆ తర్వాత ప్రభాస్ నుంచి గోపీచంద్ ని కాపాడేందుకు బాలకృష్ణ అడ్డు గోడగా నిలుస్తారు. లాస్ట్ లో అది ఒంగోలియన్స్ అంటే అని బాలయ్య డైలాగ్ చెప్తారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఓ రేంజ్ లో దుమ్ము దులిపేస్తుందన్న మాట. ఏది ఏమైనా గానీ ఓటీటీలో బాలయ్య అలరించినంతగా ఇంకెవరూ అలరించలేరు. ఇక వర్షం సినిమాలో కలిసి నటించిన ప్రభాస్, గోపీచంద్ లు.. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇలా కలిసి ఓటీటీ స్క్రీన్ ని షేర్ చేసుకున్నారు. ఈ కాంబినేషన్ లో ఇంకో సినిమా వస్తే పక్కా కమర్షియలే కదా మీరేమంటారు?