సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు సొంత పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. అలాంటి వారిలో అతికొద్ది మందే సక్సెస్ సాధించారు. మరికొందరు యూటర్న్ తీసుకొని.. తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోయారు. తెలుగు నాట యన్టీఆర్, తమిళ నాట ఎంజీఆర్ లు సొంతగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి పదవులు చేపట్టి రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నేటి తరానికి చెందిన హీరోలు కూడా సినిమాలకు గుడ్ బై చెప్పి.. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయ నిధి స్టాలిన్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా ఉదయ నిధి స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
తాను ఇండస్ట్రీలో ఉంటూ రాజకీయాలు చేయడం సరైన పద్దతి కాదనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నానని.. ప్రస్తుతం తాను నటించే ‘మామన్నన్’ చిత్రం తన చివరిదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ మూవీలో ఉదయ నిధి స్టాలిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది.. మరో ముఖ్యపాత్రలో ఫాహద్ ఫజల్ స్తున్నాడు. ఈ మూవీ మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.. సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నాడు.
‘ఓకే ఓకే’ సినిమాతో హీరోగా మారిన ఉదయ నిధి స్టాలిన్ కెరీ 13 సినిమాలు చేశాడు. అందులో దాదాపు 7 సినిమాలు హిట్ అయ్యాయి. ఇదిలా ఉంటే. రాబోయే రోజుల్లో జరిగే కేబినెట్ విస్తరణలో పార్టీ యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్‌ను క్యాబినెట్లో సభ్యుడిగా నియమించనున్నట్లు డీఎంకే వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.