ఒకప్పుడు సినిమాలు థియేటర్లలో వందల రోజులాడేవి. కొన్ని చిత్రాలు సంవత్సరాల పాటు ప్రదర్శించిన దాఖలాలూ ఉన్నాయి. రాను రాను ఈ వ్యవహారంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఎక్కువ కాలం హాళ్లలో సినిమాలు ఆడే రోజులు పోయాయి.
ఒకప్పుడు సినిమాలు థియేటర్లలో వందల రోజులాడేవి. కొన్ని చిత్రాలు సంవత్సరాల పాటు ప్రదర్శించిన దాఖలాలూ ఉన్నాయి. రాను రాను ఈ వ్యవహారంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఎక్కువ కాలం హాళ్లలో సినిమాలు ఆడే రోజులు పోయాయి. అప్పటికి ఇప్పుటి పరిస్థితులు పూర్తిగా వేరు. ఒక చిత్రం నిర్మాణంలో ఉండగానే ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్ను ఫిక్స్ చేసేసుకుంటున్నారు మేకర్స్. 4 లేదా 6 నుంచి 8 వారాల తర్వాత విడుదల చేసేలా డిజిటల్ రైట్స్ దక్కించుకుంటున్నారు. ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు రెండు, మూడు వారాల థియేట్రికల్ రన్ పూర్తవకుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. తాజాగా ‘మామన్నన్’ కూడా రిలీజ్ కాబోతుందంటూ అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చారు.
వడివేలు, ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, ఫాహద్ ఫాజిల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ్ మూవీ ‘మామన్నన్’. సమాజంలో చోటు చేసుకునే సంఘటనలనే కథా వస్తువులుగా తీసుకుని, పేద, ధనిక వర్గాల నేపథ్యం గురించి చూపిస్తూ.. ‘పరియేరుమ్ పెరుమాళ్’ (Pariyerum Perumal), ‘కర్ణన్’ (Karnan) వంటి అద్భుతమైన సినిమాలతో ఆకట్టుకున్న మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేశాడు. జూన్ 29న తమిళనాట విడుదలైన ‘మామన్నన్’ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు ఉదయనిధి స్టాలిన్ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించింది. సింపుల్ బడ్జెట్లో తీస్తే, రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో డబ్ చేసి విడుదల చేశారు.
తెలుగులో ‘నాయకుడు’ పేరుతో జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్దగా పబ్లిసిటీ లేకుండా సడెన్గా వచ్చినప్పటికీ, చూసిన వాళ్లంతా బాగుంది అని చెప్తున్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుందని ప్రకటించేశారు. జూలై 27 నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ్ మినహా ఇతర భాషల్లో విడుదలై రెండు వారాలు కూడా పూర్తి కాకుండానే ఓటీటీలోకి రానుండడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. థియేటర్లో మిస్ అయిన వాళ్లు ఎలాగూ చూస్తారు కాబట్టి, ఈ మూవీకి ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.
VADIVELU, UDHAYANIDHI, FAHADH, KEERTHY, MARI SELVARAJ AND AR RAHMAN TOGETHER!! We’re seeing stars🤩#Maamannan, coming to Netflix on the 27th of July!🍿#MaamannanOnNetflix pic.twitter.com/Fl8ulKvdID
— Netflix India South (@Netflix_INSouth) July 18, 2023