ఏఆర్ రెహ్మాన్ భార్య తమిళంలో సరిగా మాట్లాడలేకపోవటాన్ని కొందరు తమిళ నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. ఆమెపై సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటి కస్తూరి కూడా కామెంట్లు చేశారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ భార్య సైరా భాను తమిళంలో సరిగా మాట్లాడలేకపోవటంపై సోషల్ మీడియా వ్యాప్తంగా ట్రోలింగ్స్‌కు గురవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమిళ నెటిజన్లు ఆమెపై ఓ స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఆమెతో పాటు ఏఆర్ రెహ్మాన్‌పై కూడా ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ తమిళ, తెలుగు నటి కస్తూరి శంకర్ కూడా ఏఆర్ రెహ్మాన్ భార్యపై కామెంట్లు చేశారు. ‘‘ ఏమిటి ? ఏఆర్ రెహ్మాన్ భార్యకు తమిళం తెలీదా? ఆమె మాతృ భాష ఏది? వాళ్లు తమ ఇళ్లలో ఏ భాష మాట్లాడుకుంటారు?’’ అని ప్రశ్నించింది. ఇక, కస్తూరి శంకర్ కామెంట్లపై ఏఆర్ రెహ్మాన్ స్పందించారు.
‘‘ ప్రేమకు భాష లేదు’’ అని పేర్కొన్నారు. ప్రసుత్తం ఆయన ఇచ్చిన ఈ రిప్లై తాలూకా పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఏఆర్ రెహ్మాన్ తాజాగా తన భార్య సైరా భానుతో కలిసి చెన్నైలో జరిగిన వికటన్ అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజిపైకి ఎక్కిన రెహ్మాన్ తన భార్య గురించి చెప్పారు. సైరా బాను తన ఇంటర్వ్యూలను ఒకటికి రెండు సార్లు చూస్తుందని అన్నారు. తాను మాత్రం ఆ ఇంటర్వ్యూలను చూడనని చెప్పారు. ఈ నేపథ్యంలోనే యాంకర్ సైరా భానును వేదికపైకి పిలిచారు. స్టేజిపైకి వచ్చిన తర్వాత ఆమెను మాట్లాడమని అడిగారు. సైరా భాను హిందీలో మాట్లాడుతుండగా.. ఏఆర్ రెహ్మాన్ ఆపారు.
తమిళంలో మాట్లాడమని కోరారు. అయితే, ఆమె తమిళంలో సరిగా మాట్లాడలేకపోయారు. తాను తమిళంలో మాట్లాడలేకపోయినందుకు క్షమాపణలు చెప్పారు. తాను ఏఆర్ రెహమాన్ గొంతు విని ప్రేమలో పడిపోయానని అన్నారు. సైరా భాను తమిళంలో మాట్లాడలేకపోవటంతోటే రచ్చ మైదలైంది. అయితే, రెహ్మాన్ ఇచ్చిన రిప్లైతో వివాదానికి తెరపడినట్లు అయింది. మరి, సైరా భాను తమిళంలో మాట్లాడలేకపోవటం కారణంగా ఆమెపై కామెంట్లు చేయటం సమంజసం అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
கேப்புல பெர்பாமென்ஸ் பண்ணிடாப்ள பெரிய பாய்
ஹிந்தில பேசாதீங்க தமிழ்ல பேசுங்க ப்ளீஸ் 😁 pic.twitter.com/Mji93XjjID
— black cat (@Cat__offi) April 25, 2023