అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రదీప్ మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక అంబర్ పేట్ వీధి కుక్కల ఘటనపై స్పందించాడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్. దాంతో ఓ నెటిజన్ కు యంగ్ డైరెక్టర్ కు మధ్య మాటల యుద్దం మెుదలైంది.
హైదరాబాద్ లోని అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఈ ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఇక ఈ సంఘటనపై ఇప్పటికే మంత్రి కేటీఆర్, హైదరాబాద్ మేయర్ స్పందించిన విషయం తెలిసిందే. ఇక అంబర్ పేట్ వీధి కుక్కల ఘటనపై స్పందించాడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్. సీసీటీవీ ఫుటేజీని తన ట్వీటర్ ఖాతాలో షేర్ చెయ్యడంతో ఓ నెటిజన్ కు యంగ్ డైరెక్టర్ కు మధ్య మాటల యుద్దం మెుదలైంది.
ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రదీప్ మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే అంబర్ పేట్ ఘటన వీడియోను తన ట్వీటర్ ఖాతాలో షేర్ చేశాడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్, నిర్మాత సాయిరాజేష్. దాంతో డైరెక్టర్ పై ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు. డైరెక్టర్ సాయి రాజేష్ సైతం ఆ నెటిజన్ కు గట్టి కౌంటరే ఇచ్చాడు. ఓ జర్నలిస్టు ట్వీటర్ లో చేసిన ఈ వీడియోను షేర్ చేశాడు సాయిరాజేష్. దాంతో ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఇలాంటి వీడియోలను ఎలా షేర్ చేస్తారు. నువ్వు అసలు మనిషివేనా, చాలా సెన్సిటివ్ పీపుల్ ఉంటారు. ఇలాంటి వీడియోలు షేర్ చెయ్యడం తప్పు అని ఆ నెటిజన్ రాసుకొచ్చాడు.
ఈ కామెంట్ డైరెక్టర్ రాజేష్ కు కోపం తెప్పించింది. నువ్వు సెన్సిటివ్ అయితే దుప్పటేసుకుని సొసైటీని చూడకుండా ఇంట్లో కూర్చో అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. మరికొన్ని కౌంటర్లు.. రీ కౌంటర్లు ఇచ్చుకున్నారు ఇద్దరు. అయితే కొందరు సాయిరాజేష్ ను సమర్థిస్తుంటే.. మరికొందరేమో ఆ నెటిజన్ ను సమర్థిస్తున్నారు. కాగా.. సాయిరాజేష్ కొబ్బరి మట్ట, కలర్ ఫోటో, హృదయకాలేయం లాంటి సినిమాలకు నిర్మాత వ్యవహరించాడు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘బేబి’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Nuvvu sensitive ayithe duppatesukoni society ni choodakunda intlo moolana koorcho…
Issue ni address cheyyaledu…eediki bongulo sensitivity okati.. https://t.co/eu2YhoI0o9— Sai Rajesh (@sairazesh) February 21, 2023
Orey Babu issue ni address chey evadu kaadu analedu ,aa graphic videos pedithe chusevadu sensitive vuntaru kontha mandi , for suppose rape incident video bayataku vaste adi post chestava ,issue address cheyyali ante video pettalsina avasaram ledu
— Rama Krishna (@_Rama_Krishna_) February 21, 2023