ఫోన్ ఓపెన్ చేస్తే చాలు.. ఎక్కడ చూడు పెళ్లి ఫొటోలే కనిపిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వరసపెట్టి మరీ మ్యారేజ్ చేసేసుకుంటున్నారు. తమకు నచ్చిన వ్యక్తితో ఏడడుగులు వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినీ, టీవీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి. మొన్నటికి మొన్న టీవీ సీరియల్ యాక్టర్స్ అమర్ దీప్-తేజస్విని జరగ్గా.. ఇప్పుడు పలు సీరియల్స్ లో విలన్ తరహా పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్న సునంద మాల వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. వైజాగ్ లో పుట్టి పెరిగిన సునందమాల, ఆ తర్వాత హైదరాబాద్ లో సెటిలైపోయింది. చిన్నప్పటి నుంచి డ్యాన్సింగ్ అంటే ఇష్టం ఉండటంతో ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నాలు చేసింది. చిన్న చిన్న రోల్స్ చేస్తూ సీరియల్స్ లో గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ ప్రారంభంలో ఈటీవీ, జీ తెలుగు లో యాక్ట్ చేసి పాపులారిటీ దక్కించుకుంది. అలానే ప్రేక్షకులకు కూడా దగ్గరయింది. ఇక ‘ముద్ద మందారం’ సీరియల్ గా విలన్ గా చేసిన ఈమె.. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమ్ సంపాదించింది.
ప్రస్తుతం ‘హిట్లర్ గారి భార్య’ సీరియల్ లో చేస్తున్న సునంద.. కొన్నాళ్ల క్రితం తను ప్రేమించిన శంకర్ అనే వ్యక్తితో ఎంగేజ్ మెట్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా పోస్ట్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా మ్యారేజ్ చేసుకుంది. ఇక తన యూట్యూబ్, ఇన్ స్టా ద్వారా ఎప్పటికప్పుడు పెళ్లి విషయాలని షేర్ చేస్తూ వచ్చింది. ఇక తాజాగా జరిగిన సునంద పెళ్లికి బుల్లితెర నటి రోహిణితోపాటు ‘ముద్ద మందారం’లో హీరోయిన్ గా చేసిన తనూజ అటెండ్ అయి కొత్త జంటని దీవించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. మరి సునంద పెళ్లి వీడియో మీకెలా అనిపించింది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.