హీరోయిన్ హనీరోజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. బాలయ్యతో 'వీరసింహారెడ్డి' చేయడం ఏమో గానీ ఈమె లక్ మారిపోయింది. ఇప్పుడు ఈ బ్యూటీ తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎప్పుడో ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో సరైన గుర్తింపు రాలేదు. రీసెంట్ గా బాలయ్యతో ఒకే సినిమా చేసింది. కట్ చేస్తే ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఎవరి గురించి చెబుతున్నామో అర్థమైపోయింది అనుకుంటా.. యస్ మీరు గెస్ చేసింది కరెక్టే. హీరోయిన్ హనీరోజ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా సరే ఈమెనే కనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఫొటోలు, వీడియోలతో రచ్చ లేపుతోంది. ఇప్పుడు హనీ.. తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఈమె ఏం చెప్పింది?
ఇక విషయానికొస్తే.. హనీరోజ్ స్వతహాగా మలయాళీ. పుట్టి పెరిగింది అంతా కేరళలోనే. 2005లోనే ‘బాయ్ ఫ్రెండ్’ అనే మలయాళ మూవీతో నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళ, తెలుగులోనూ మూవీస్ చేసింది. 2008లో ‘ఆలయం’లో హీరోయిన్ గా చేసి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. కానీ ఈమెకు పెద్దగా ఫేమ్ అయితే రాలేదు. 2014లో ‘ఈ వర్షం సాక్షిగా’ అనే మరో తెలుగు మూవీ చేసింది. దీంతో మలయాళంలోనే ఎక్కువగా నటిస్తూ వచ్చింది. రీసెంట్ గా బాలయ్య ‘వీరసింహారెడ్డి’లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేసి సూపర్ హిట్ కొట్టింది. అంతులేని ఫేమ్ సంపాదించుకుంది.
బాలయ్య మూవీ తర్వాత ఏ మూవీ ఒప్పుకొందో లేదో తెలియదు గానీ షాప్, మాల్ ఓపెనింగ్స్ కు గెస్ట్ గా హాజరవుతూ ఫుల్ బిజీగా మారిపోయింది. తాజాగా విజయవాడలో ఓ బేకరీ ఓపెనింగ్ కు వచ్చిన హనీరోజ్.. తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘పెళ్లి అనేది ఓ పెద్ద బాధ్యత. దానికి నేను రెడీగానే ఉన్నాను. అలానే పెళ్లి బంధం బలంగా ఉండటం కోసం నేను ఏమైనా సరే చేస్తాను’ అని చెప్పుకొచ్చింది. ఇంతా చెప్పింది కానీ పెళ్లి కొడుకు ఎవరు ఏంటనేది మాత్రం హింట్ ఇవ్వలేదు. దీంతో త్వరలో హనీరోజ్ పెళ్లి చేసుకోబోతుందని అభిమానులు అప్పుడే చర్చ స్టార్ట్ చేసేశారు. మరి మ్యారేజ్ పై హనీరోజ్ మాటలపై మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.