ఇండస్ట్రీలో హీరోయిన్స్ లైఫ్ పై ఎన్నో అపోహలు, రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఒకప్పుడు సినిమా హీరోయిన్ అంటే.. వింతగా, అదో రకంగా చూసేవారు. వాళ్లకు మర్యాద ఉండదు, సినిమాల్లోకి వెళ్తే చెడిపోతారు అనేవిధంగా భావించేవారు. కానీ.. కొన్నాళ్లుగా సినిమాల్లోకి హీరోయిన్స్ గా అమ్మాయిలు ఇంటరెస్ట్ చూపిస్తుండటం.. హీరోయిన్స్ గా కెరీర్ ఎంచుకోవడం.. రాణించడం చూస్తున్నాం.
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ లైఫ్ పై ఎన్నో అపోహలు, రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఒకప్పుడు సినిమా హీరోయిన్ అంటే.. వింతగా, అదో రకంగా చూసేవారు. వాళ్లకు మర్యాద ఉండదు, సినిమాల్లోకి వెళ్తే చెడిపోతారు అనేవిధంగా భావించేవారు. కానీ.. కొన్నాళ్లుగా సినిమాల్లోకి హీరోయిన్స్ గా అమ్మాయిలు ఇంటరెస్ట్ చూపిస్తుండటం.. హీరోయిన్స్ గా కెరీర్ ఎంచుకోవడం.. రాణించడం చూస్తున్నాం. కాలంతో పాటే అపోహలు కూడా తొలగిపోతున్నాయి. అయినా.. హీరోయిన్ అనేసరికి రెస్పెక్ట్, చూసే విధానం ఇంకాస్త మారలేదేమో అనిపిస్తుంది. హీరోయిన్స్ అనే కాదు.. నటనవైపు అమ్మాయిలు ఎవరు వెళ్లినా.. కొత్తగా, వింతగా చూస్తూ.. తప్పుగా ఆలోచించేవారు ఎంతోమంది ఉన్నారు.
ఇక హీరోయిన్స్ కి పెళ్లిళ్లు కూడా సరిగ్గా కావని అపోహలు కూడా నాటుకున్నాయి. అవన్నీ కాదు.. పెళ్లి, కెరీర్ విషయంలో హీరోయిన్స్ పడే కష్టాలు వేరే ఉన్నాయని అంటోంది స్టార్ హీరోయిన్ కృతిసనన్. వన్ నేనొక్కడినే, దోచేయ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ.. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైంది. వరుస సూపర్ హిట్స్ తో స్టార్డమ్ అందుకుంది. ఏకంగా పాన్ ఇండియా సినిమాలలో అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం చేతినిండా పెద్ద సినిమాలతో పాటు పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది అమ్మడు. డార్లింగ్ ప్రభాస్ సరసన నటించిన ఈ ఆదిపురుష్ మూవీ జూన్ 16న రిలీజ్ కాబోతోంది.
ఈ క్రమంలో రీసెంట్ గా కృతిసనన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. పెళ్లిపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కృతి మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి త్వరగా పెళ్లిళ్లు కావనే అభిప్రాయం ఎన్నాళ్ళుగానో చాలామందిలో ఉంది. హీరోయిన్స్ ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. యాక్టింగ్ అనేది ఓ హీరోయిన్ లైఫ్ లో ఓ భాగమనేది ఇంకా ఓకే చేయలేకపోతున్నారు. అందుకే హీరోయిన్స్ కి పెళ్లి కావడం కష్టం. నా కెరీర్ ప్రారంభంలో చాలామంది ఈ విషయంపై కంగారు పెట్టే ప్రయత్నం చేశారు. కానీ.. నేను వాళ్ళ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. ఆ విధంగా ముందడుగు వేసి.. నేను కోరుకున్న వృత్తిలో రాణిస్తున్నాను.” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కృతి మాటలను సోషల్ మీడియాలో కొంతమంది సమర్థిస్తుండగా.. మరికొందరు అభ్యంతరాలు తెలుపుతున్నారు. సో.. పెళ్లిపై కృతిసనన్ చేసిన వ్యాఖ్యలపై గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.