ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఫ్యాన్స్ లో, హీరో హీరోయిన్స్ లో ఆ సందడి వేరే లెవెల్ లో ఉంటుంది. ఏ సినిమా ప్రమోషన్స్ కైనా, ఏ ఇంటర్వ్యూలోనైనా తమ అభిమాన హీరో హీరోయిన్లు ఏమేం మాట్లాడతారా.. అని వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. అంతా బాగానే ఉంటుంది కానీ.. పక్క భాషల హీరోయిన్స్ వస్తే మాత్రం కొన్నిసార్లు వారి మాటల్లో అనుకోకుండా వివాదాస్పద పదాలు బయటపడుతుంటాయి.
అలా అనుకోకుండా నోరుజారిన మాటలే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి ట్రోల్స్ కి గురి చేస్తుంటాయి. తాజాగా అలాంటి ట్రోల్స్ ఎదుర్కొంటుంది స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే. ప్రస్తుతం పూజాహెగ్డే రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. మార్చి 11న సినిమా రిలీజ్ కాబోతుండటంతో హైదరాబాద్, చెన్నై, ముంబై ఇలా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలలో ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు.
ఇక ఇటీవలే పూజాహెగ్డే, దళపతి విజయ్ సరసన నటిస్తున్న ‘బీస్ట్’ సినిమా నుండి ‘అరబిక్ కుతు‘ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అద్భుతమైన రెస్పాన్స్ తో అరబిక్ కుతు సాంగ్.. యూట్యూబ్ లో 125 మిలియన్స్ పైగా వ్యూస్ దక్కించుకొని ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో ప్ తమిళ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా.. కెరీర్ లో సక్సెస్ గురించి మాట్లాడుతూ.. ‘సక్సెస్ అనబోయి పొరపాటున సెక్స్ అనే పదం వాడేసింది. ఆ వెంటనే మళ్లీ సక్సెస్ అని కవర్ చేసేసింది. కానీ పూజా నోటి వెంట వచ్చిన ఆ పదం మాత్రం నెట్టింట ట్రెండ్ అవుతోంది.
ఏదో అనుకోకుండా పలికిన పదానికి సోషల్ మీడియాలో పూజా పై ట్రోల్స్ విపరీతంగా జరుగుతున్నాయి. పూజాని ఇంటర్వ్యూ చేసిన సదరు యూట్యూబ్ ఛానల్ ఆమె మాటలు డిలీట్ చేసినా ట్రోలర్స్ మాత్రం ఆ బిట్ నే వైరల్ చేస్తున్నారు. సినిమా హీరోయిన్స్ అన్నాక ఇంటర్వ్యూలలో కంగారుపడి అనేస్తుంటారు. ఇది చాలా మంది విషయంలో జరుగుతుంటుంది. మరి ఈ పూజా మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.