పై ఫొటోలో ఉన్న పాప ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా ప్యాన్ ఇండియా లెవెల్‌లో సినిమాలు చేస్తున్నారు. తాజాగా, ఆమె ఓ పెద్ద సినిమానుంచి అనుకోని విధంగా బయటకు రావాల్సి వచ్చింది.
పై ఫొటోలో అమాయకంగా చూస్తూ నిల్చుని ఉన్న ఈ పాప ఇప్పుడో స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీ.. ఇలా దేశ వ్యాప్తంగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. హీరోయిన్‌గానే కాదు.. ఐటమ్ సాంగుల్లోనూ మెరుస్తూ కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తున్నారు. తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో ఎక్కువ సినిమాలు చేశారు. అందులో బ్లాక్ బాస్టర్ హిట్లు కూడా ఉన్నాయి. హిందీలో మొదటి సినిమానే ఓ స్టార్ హీరో పక్కన నటించే అవకాశం దక్కించుకున్నారు.
అయితే, ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఓ పెద్ద సినిమానుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఇక, మీడియాలో ఆమె గురించే వార్తలు వస్తున్నాయి. పై ఫొటోలో ఉన్నది ఇంకెవరో కాదు.. ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే. ఆమెను మహేష్ బాబు- త్రివిక్రమ్‌ల ‘గుంటూరు కారం’ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే, అనుకోని కారణాల వల్ల ఆ సినిమానుంచి ఆమె బయటకు రావాల్సి వచ్చింది. ఆ కారణం ఏంటన్నది ఇంకా మిస్టరీగానే ఉంది. మీడియా మాత్రం తమకు తోచిన కారణాలను ప్రచురిస్తోంది.
కాగా, పూజా హెగ్డే ‘ఒక లైలా కోసం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ముకుంద సినిమాతో తొలిహిట్టును అందుకున్నారు. అల వైకుంఠపురం సినిమాతో యూత్‌లో పిచ్చ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక, అప్పటినుంచి కుర్రాళ్లు ఆమెను బుట్ట బొమ్మ అని పిలవటం మొదలుపెట్టారు. హిందీలోనూ ఆమె పలు సినిమాల్లో నటించారు. హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్‌ల సరసన హీరోయిన్‌గా చేశారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘కిసీకా భాయి.. కిసీ కి జాన్’ సినిమా ప్రేక్షకుల ముందకు వచ్చింది. అయితే, ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.