బుల్లితెర పై యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ భరద్వాజ్.. ప్రస్తుతం సినీనటిగా క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీ అవుతోంది. ఓవైపు టీవీ షోలకు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలను సమానంగా మేనేజ్ చేస్తోంది అనసూయ. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ.. అప్పుడప్పుడు వివాదాస్పద పోస్టులు, కామెంట్స్ తో వార్తలలో హాట్ టాపిక్ అవుతుంటుంది.
ఇటీవలే ఉమెన్స్ డే సందర్భంగా అనసూయ పెట్టిన పోస్ట్.. సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపిన అనసూయ.. అదేవిధంగా ‘ఇదేంటి ఒక్కసారిగా మహిళా దినోత్సవం రోజు.. మీమర్స్, ట్రోలర్స్ మహిళలను గౌరవించడం మొదలుపెట్టారు. అయినా ఎలాగో ఈ గౌరవమంతా 24 గంటల్లో ముగుస్తుంది కదా.. హ్యాపీ ఫూల్స్ డే’ అని వెటకారంగా ట్వీట్ పెట్టింది.
Oh! Suddenly realised its the day every troller and meme maker suddenly starts respecting women.. of course it expires in 24 hours! So all you women out there! Happy fools day!! 🙄
— Anasuya Bharadwaj (@anusuyakhasba) March 8, 2022
ఇక అనసూయా వెటకారం పై సోషల్ మీడియాలో నెటిజన్స్ మండిపడుతున్నారు. అనసూయ వెటకారానికి ఎదురు సమాధానంగా.. ‘ఒక మదర్ థెరిసా, కల్పనా చావ్లా, మేరీకోమ్, యాంకర్ సుమ లాంటి వాళ్ళను ఎందుకు ట్రోల్ చేయరు. ఎందుకంటే మగవారు ఆడవారి బిహేవియర్ ని గౌరవిస్తారు. కానీ నీలాంటి వాళ్ళను కాదు’ అంటూ చేసిన ట్వీట్ మరింత రచ్చకు దారితీసింది.ఆ ట్వీట్ అనంతరం అనసూయ కూడా స్పందించి.. ‘నా ట్వీట్ కింద కామెంట్స్ చేస్తున్న గుమ్మడికాయ దొంగలను మీరు చూడవచ్చు. అంతా బాగుండండి’ అని మరో ట్వీట్ వేసింది. ఆ వెంటనే ఓ నెటిజన్.. ‘గాలికి పోయే కంపను తగిలించుకోవడం అంటే ఇదేనేమో’ అని.. మరొకరు చేసేదంతా చేసుకుంటనే పైకి ఇలాంటి ట్వీట్స్ పెడుతుంది.. అవసరమా! అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అనసూయ పోస్ట్ పై మీమర్స్, ట్రోలర్స్ చేసిన రచ్చ నెట్టింట మాములుగా లేదు. ప్రస్తుతం ఆ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. మరి అనసూయ ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Gaali ki poye kampani thagilinchukovatam ante edenemo🙄🙄🙄….. pic.twitter.com/9ixZ4Wr5X0
— Ram Mekala (@RamMekala3) March 8, 2022