సినిమా ఇండస్ట్రీలో నటీనటులకు సంబంధించిన గాసిప్స్, రూమర్స్, వారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ఇదే తరహాలో యాంకర్ అనసూయ తన భర్తతో కలిసి మామిడి తోటలో రచ్చ చేస్తోంది.
అనసూయ భరద్వాజ్ పొట్టి బట్టలు ధరించి థైస్ అందాలు చూపిస్తూ సెగలు పుట్టిస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తూ స్పందిస్తున్నారు. అనసూయ భరద్వాజ్ సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. తన అందంతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై సందడి చేసింది. జబర్ధస్త్ షోలో యాంకరింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది.
యాంకర్ గా చేస్తూనే సినిమా అవకాశాలు రావడంతో పలు సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు సాధించింది. ముఖ్యంగా రంగస్థలం, పుష్ప మూవీల్లో చేసిన పాత్రలకు అనసూయకు విశేషమైన ఆధరణ లభించింది. ఆ మధ్య సోషల్ మీడియాలో వివాదాస్పదమైన కామెంట్లు చేసి వివాదాల్లో చిక్కుకుంది. కాగా సమయం దొరికినప్పుడల్లా గ్లామర్ షో చేస్తూ యవతలో హీట్ పెంచేస్తూ ఉంటుంది. రీసెంట్ గా తన భర్తతో కలిసి సాగర తీరాన హాట్ ఫోజులతో రచ్చ చేసింది.
బికినీ ధరించి ఎద అందాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే తాజాగా మామిడితోటలో భర్తతో కలిసి వెళ్లిన అనసూయ మామిడి కాయలను తెంపుతూ దర్శనమిచ్చింది. పొట్టి బట్టలు ధరించి అందంతో అదరగొట్టింది. అనసూయ మామిడికాయలు తెంపే క్రమంలో అవి అందకపోవడంతో భర్త భరద్వాజ్ అమాంతం ఎత్తుకున్నాడు. భర్త ఎత్తుకుని ఉండగా అనసూయ మామిడికాయలను కోసింది. భర్తతో కలిసి రొమాంటిక్ యాంగిల్ లో ఫొటోలకు పొజులిచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ మిర్చి సినిమాలో మాదిరిగా అనుష్క, ప్రభాస్ ను ఎత్తుకోగా హీరో మామిడి కాయలు తెంపినట్లుగా, ఇక్కడ వీళ్లు దానికి రివర్స్ లో ఆ సీన్ రిపీట్ చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు.