ఒక స్టార్ నటి తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫొటోల్లో ఆమె కాస్త లావుగా ఉండటంతో నెటిజన్స్ బాడీ షేమింగ్ చేస్తున్నారు.
సినిమాల్లో నటించడం అంటే అంత ఈజీ కాదు. ఒకవేళ యాక్టింగ్ కెరీర్లో ఛాన్స్ సులువుగా వచ్చినా.. ఇక్కడ నిలుదొక్కుకోవడం చాలా కష్టం. ఎంతటి నటనా పటిమ ఉన్నప్పటికీ చూడటానికి కూడా అందంగా ఉండాలి. రజినీకాంత్, నానా పటేకర్ లాంటి ఒకరిద్దరు నటులు మాత్రమే దీనికి మినహాయింపు. వారు అందంతో సంబంధం లేకుండా నటనతోనే ఈస్థాయికి చేరుకున్నారు. చాలా మటుకు నటుల్లో అందాన్ని చూస్తుంటారు ప్రేక్షకులు. అందుకే యాక్టర్స్ కూడా నటనను మెరుగుపర్చుకుంటూనే ఫిట్‌నెస్‌పై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. ముఖ్యంగా హీరోయిన్లు, నటీమణుల విషయంలో అందానికి బాగా ప్రాముఖ్యత ఇస్తుంటారు. వారు కాస్త లావుగా కనిపించినా లేదా మరీ సన్నగా మారినా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తుంటాయి.
బాడీ షేమింగ్ చేయడం ఈమధ్య మరీ ఎక్కువైపోయింది. ముఖ్యంగా సినీ తారలు, టెలివిజన్ నటులపై బాడీ షేమింగ్ చేయడం బాగా పెరిగింది. అందుకు ఇప్పుడు చెప్పుకునే ఘటనే మరో ఉదాహరణ. భోజ్‌పురి ప్రముఖ నటి త్రిష కర్ మధుకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నటనతో పాటు అందంతోనూ ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్నారామె. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే త్రిష కర్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫొటోలు షేర్ చేశారు. ‘నేను నీ సొంతం కాదు’ అని వీటికి క్యాప్షన్ జత చేశారు. ఇందులో బ్లాక్, సిల్వర్ కలర్ శారీలో ఆమె తళుక్కున మెరిశారు. అంతవరకు బాగానే ఉన్నా ఫొటోల్లో త్రిష కర్ కాస్త బొద్దుగా కనిపించారు.
త్రిష కర్ లేటెస్ట్ ఫొటోలపై నెటిజన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఏంటి ఇంత లావయ్యావు, అప్పుడే ప్రెగ్నెంటా అంటూ ప్రశ్నల వర్షం కురిపిచారు. కాగా, గతేడాది త్రిష కర్కు సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో నెట్టింట లీకైంది. అందులో ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా ఉండటంతో ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియో దుమారం ముగిసిన తర్వాత ఆమె పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటిస్తూ బిజీ అయిపోయారు. అలాంటి తరుణంలో మళ్లీ ఆమెపై ఇప్పుడు ట్రోలింగ్ మొదలైంది. అయితే త్రిష కర్ ఫ్యాన్స్ మాత్రం ఇది సరికాదంటూ.. తమ అభిమాన నటిపై బాడీ షేమింగ్ చేస్తున్న వారి మీద మండిపడుతున్నారు.