తెలుగు చలన చిత్ర ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి హఠాన్మారణంపై యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. అయితే ఇటీవల న్యూమోనియాతో ఆస్పత్రిలో చేరిన సిరివెన్నెల ఆరోగ్యం విషమించడంతో మంగళవారం సాయంత్రం మరణించారు. సిరివెన్నెల మరణించాడన్న వార్త తెలియగానే చిరంజీవితో సహా మిగతా ప్రముఖ నటులంతా సికింద్రాబాద్ లోని ఆస్పత్రికి చేరుకున్నారు. ఇక ఆయన మృతిపై తెలుగు సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ నేతలు సైతం ఆయనతో ఉన్న అనుబంధాలను నెమరువేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
Sitarama Shastry Garu pic.twitter.com/QfC7Gjakvc
— Ram Gopal Varma (@RGVzoomin) November 30, 2021
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అయిన రామ్ గోపాల్ వర్మ సిరివెన్నెల మరణంపై ట్విట్టర్ స్పందించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని వర్మ పంచుకున్నారు. ఈ భూమి మీద పుట్టిన ప్రతీ ఒక్కరు మీరు, నేను అందరం మరణిస్తామని ఆయన వచ్చే తరం కవులకు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. ఆయన లాంటి వ్యక్తం మరణించడం అనేది చాలా బాధాకరమన్నారు. ఇక వర్మ సినిమాలకు పాటలు రాసిన సిరివెన్నెల పాటల్లోని కొన్ని పాటలు పాడుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని జ్ణాపకాలను బయటపెట్టారు.
ఇక ఇదే కాకుండా సీతారామశాస్త్రి రాసిన ఎన్నో పాటలు నాకు ప్రేరణగా నిలిచియాన్నారు. అంతేకాకుండా మీరు తప్పకుండా స్వర్గానికి పోతారని.. నేను మాత్రం నరకానికి పోతానన్నారు. ఒకవేళ నేను స్వర్గానికి వచ్చి ఉంటే.. అక్కడ వోడ్కా మీరు నాతో తాగరు. కానీ మనిద్దరం కలిసి అమృతం తాగుదామంటూ వాయిస్ రికార్డు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంత్యక్రియల్లో అటు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, పాల్గొన్నారు.
— Ram Gopal Varma (@RGVzoomin) November 30, 2021