తెలుగు చలన చిత్ర ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి హఠాన్మారణంపై యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. అయితే ఇటీవల న్యూమోనియాతో ఆస్పత్రిలో చేరిన సిరివెన్నెల ఆరోగ్యం విషమించడంతో మంగళవారం సాయంత్రం మరణించారు. సిరివెన్నెల మరణించాడన్న వార్త తెలియగానే చిరంజీవితో సహా మిగతా ప్రముఖ నటులంతా సికింద్రాబాద్ లోని ఆస్పత్రికి చేరుకున్నారు. ఇక ఆయన మృతిపై తెలుగు సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ నేతలు సైతం ఆయనతో ఉన్న అనుబంధాలను నెమరువేసుకుని […]