ఈ మధ్యకాలంలో సినిమా పాటలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు పాతదే. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తర్వాత సినిమా ఫంక్షన్స్ తగ్గించడంతో.. ఈ విధంగా ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తూ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు మేకర్స్. సినిమా రిలీజ్ దగ్గరపడే సరికి అన్ని పాటలు విడుదలై జనాల నోళ్లలో నానుతుంటాయి. అది సినిమాకు ప్లస్ అవుతుంది.సౌత్ ఇండియాలో దళపతి విజయ్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. తమిళ స్టార్ అయినప్పటికీ తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. గతేడాది మాస్టర్ సినిమాతో అలరించిన విజయ్ త్వరలోనే బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్ 14న విడుదల కానున్న బీస్ట్ నుండి తాజాగా ‘అరబిక్ కుతు‘ అనే లిరికల్ సాంగ్ వదిలారు మేకర్స్. అనిరుధ్ సంగీతం అందించిన ఈ అరబిక్ కుతు సాంగ్.. సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపుతోంది. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నారు.
విడుదలైన 16 గంటల్లోనే 19 మిలియన్స్ వ్యూస్ రాబట్టి రికార్డు సెట్ చేసింది. అయితే.. అదిరిపోయే ఫుట్ ట్యాపింగ్ బీట్ కి విజయ్ స్టెప్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఓవైపు అనిరుధ్ వాయిస్, విజయ్ డాన్స్ లతో పాటు హీరో శివకార్తికేయన్ లిరిక్స్ పాటకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ముఖ్యంగా జానీ మాస్టర్, పాట రాసిన శివకార్తికేయన్ లకే మేజర్ క్రెడిట్ ఇవ్వాలని విజయ్ ఫ్యాన్స్ అంటున్నారు.అరబిక్ టచ్ ఉన్న ఈ పాటకి అసలు శివకార్తికేయన్ లిరిక్స్ ఎలా రాశాడు? అని అందరూ షాకయ్యారు. అయితే.. తాజాగా శివకార్తికేయన్ అరబిక్ కుతు సాంగ్ లిరిక్స్ పై క్లారిటీ ఇచ్చాడు. బుల్లితెర నుండి వెండితెర పై స్టార్ గా ఎదిగిన శివకార్తికేయన్.. తన సినిమాలతో పాటు వేరే హీరోల సినిమాలకు కూడా సాంగ్స్ రాస్తుంటాడు. ఇదివరకు కళ్యాణ వయసు, చెల్లమ్మ, సో బేబీ, సుమ్మ సుర్రును సాంగ్స్ రాశాడు.
తాజాగా ఇన్స్టెంట్ హిట్ అయిన అరబిక్ కుతు గురించి మాట్లాడుతూ.. ‘ఈ పాటకోసం నేనేమి అరబిక్ భాషను స్టడీ చేయలేదు. అరబిక్ హమ్మింగ్ పదాలను, అలాగే క్యాచీ తమిళ పదాలను జోడించి రాశాను. ఆ విధంగా అరబిక్ కుతు లిరిక్స్ రాయడం ఈజీ అయింది’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ పాటకు తీసుకున్న రెమ్యునరేషన్ దివంగత సినీగేయ రచయిత న. ముత్తుకుమార్ కుటుంబానికి అందజేసినట్లు సమాచారం. ఆ విధంగా ఈ అరబిక్ కుతు స్టార్.. ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాడు. మరి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అరబిక్ కుతు సాంగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.